Share News

తాళం వేసిన ఇంట్లో మృతదేహం

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:53 AM

అద్దెకు ఉన్న వ్యక్తి చెప్పకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించిన ఇంటి యజమానికి వివరాలు తెలియలేదు.

తాళం వేసిన ఇంట్లో మృతదేహం
Hyderabad, Crime News

హైదరాబాద్: అద్దెకు ఉన్న వ్యక్తి చెప్పకుండా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం ప్రయత్నించిన ఇంటి యజమానికి వివరాలు తెలియలేదు. దాంతో 3 నెలల తర్వాత తాళం పగులగొట్టి గదిని ఓపెన్‌ చేయగా.. పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. ఈ ఘటన నేరేడ్‌మెట్‌ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటి యజమాని లక్ష్మీకాంతరావు తన ఇంట్లో ఒక గదిని మేస్ర్తీ పని చేసే సిద్దిపేటకు చెందిన మల్లేష్‌ (50)కు అద్దెకు ఇచ్చాడు. ఇంట్లో ఒంటరిగా ఉండే మల్టేష్‌.. 3 నెలల క్రితం గదికి తాళం వేసి వెళ్లిపోయాడు.


ఎంతకీ రాకపోవడం, అద్దె చెల్లించకపోవడంతో లక్ష్మీకాంతారావు అతనికోసం ప్రయత్నాలు చేశాడు. ఇక లాభం లేదనుకొని శుక్రవారం గది తాళం పగలగొట్టి తెరిచాడు. గదిలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించింది. నేరేడ్‌మెట్‌ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అద్దెకు దిగిన మల్లేష్‌ తాళం వేసి ఎక్కడికి వెళ్లాడు.? చనిపోయిన వ్యక్తి ఎవరు..? చంపింది ఎవరు..? అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 18 , 2026 | 07:53 AM