Share News

ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్‌కు నష్టమే అంటూ వ్యాఖ్య

ABN , Publish Date - Apr 18 , 2026 | 07:24 AM

డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. వారి నిర్ణయంతో దక్షిణ భారత్, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు.

ప్రతిపక్షాలపై మంత్రి లోకేశ్ ఆగ్రహం.. దక్షిణ భారత్‌కు నష్టమే అంటూ వ్యాఖ్య
Minister Nara Lokesh

అమరావతి: డీలిమిటేషన్(Delimitation), రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) మండిపడ్డారు. వారి నిర్ణయంతో దక్షిణ భారత్, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేశ్ స్పందించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 ప్రకారం ఇప్పటివరకు రాష్ట్రాల వారీగా నియోజకవర్గాల పునర్విభజన స్తంభించిపోయిందని ఆయన తెలిపారు.


అయితే 2026 జనగణన అనంతరం ప్రతిపాదిత బిల్లులు లేకపోతే జనాభా ఆధారంగానే ప్రాతినిధ్యం(పార్లమెంట్ స్థానాలు) నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల జనాభా నియంత్రణలో మెరుగైన పనితీరు కనబరిచిన దక్షిణ భారత రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని అభిప్రాయపడ్డారు.

దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగిన రాష్ట్రాలను ఇది శిక్షించినట్లే అవుతుందని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లులను అడ్డుకోవడం ద్వారా సమాఖ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధమని మంత్రి లోకేశ్ మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి

కోట్లాది మంది మహిళలకు ద్రోహం

ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించుకోవాలి: వైఎస్‌ జగన్‌


Updated Date - Apr 18 , 2026 | 07:30 AM