Share News

ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించుకోవాలి: వైఎస్‌ జగన్‌

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:10 AM

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయో ప్రశ్నించుకోవాలని వైసీపీ ..

ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించుకోవాలి: వైఎస్‌ జగన్‌

అమరావతి, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): లోక్‌సభలో మహిళా రిజర్వేషన్‌, డీలిమిటేషన్‌ బిల్లులను వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలు ఏం సాధించాయో ప్రశ్నించుకోవాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సూచించారు. ‘దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోనుండడం, మహిళా రిజర్వేషన్‌ బిల్లు వాయిదా పడడం పచ్చినిజం. అటు దక్షిణాదికి గానీ, ఇటు మహిళలకు గానీ న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనాభా లెక్కల ప్రకారమే గనక ముందుకు వెళితే, దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. కుటుంబ నియంత్రణ పాటించి క్రమశిక్షణతో వ్యవహరించినందుకు దక్షిణాదికి ఇది ఒకరకమైన శిక్షగానే పరిణమిస్తుంది’ అని జగన్‌ పేర్కొన్నారు.

Updated Date - Apr 18 , 2026 | 04:10 AM