అక్షయ తృతీయకు ముందు గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం, వెండి
ABN , Publish Date - Apr 18 , 2026 | 06:46 AM
అక్షయ తృతీయకు ముందు వినియోగదారులకు గుడ్ న్యూస్! దేశంలో బంగారం ధరలు దిగొచ్చాయి. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఇటీవల కాలంలో వరుసగా పెరిగిన బంగారం ధరలకు తాజాగా బ్రేక్ పడింది. అక్షయ తృతీయకు ముందు జనాలకు ఊరటనిస్తూ ధరలు ఓ మోస్తరు స్థాయిలో దిగొచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 18) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,54,190గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,41,340గా ఉంది. ఇక కిలో వెండి రేటు రూ.2,74,900ల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో కూడా ఇవే రేట్స్ ఉన్నాయి.
ఇక ఇతర నగరాల్లోని ధరలను పరిశీలిస్తే ప్రస్తుతం చెన్నైలో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,55,010గా ఉంది. ఢిల్లీలో రూ.1,54,340గా, ముంబైలో 1,54,190గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,090గా, ఢిల్లీలో రూ.1,41,490గా ముంబైలో రూ.1,41,340గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) 24 క్యారెట్ల బంగారం ధర 4,829 డాలర్ల వద్ద, ఔన్స్ వెండి ధర 80 డాలర్ల వద్ద కొనసాగుతోంది. నిన్న భారత్‌లో మేలిమి బంగారం ధర రూ.1,370ల మేర తగ్గగా, ఆర్నమెంటల్ పసిడి ధరలో రూ.1,250ల మేర కోత పడింది. వెండి (కిలో) ధర రూ.5 వేల మేర తగ్గింది.
ఈ వార్తలనూ చదవండి:
ఆసియా కుబేరుడు అదానీ.. అంబానీని అధిగమించి నెం.1గా..
పసిడి దిగుమతులు రూ.6.68 లక్షల కోట్లు