Share News

పసిడి దిగుమతులు రూ.6.68 లక్షల కోట్లు

ABN , Publish Date - Apr 18 , 2026 | 05:06 AM

గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారతదేశ పసిడి దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా...

పసిడి దిగుమతులు  రూ.6.68 లక్షల కోట్లు

2025-26లో రికార్డు స్థాయికి చేరిక

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారతదేశ పసిడి దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. మార్చితో ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 7,198 కోట్ల డాలర్ల (సుమారు రూ.6.68 లక్షల కోట్లు) విలువైన పసిడి దిగుమతి చేసుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం దిగుమతైన 5,800 కోట్ల డాలర్ల పసిడితో పోలిస్తే ఇది 24 శాతం ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర చుక్కలంటడం ఇందుకు ప్రధాన కారణమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పరిమాణపరంగా పసిడి దిగుమతులు 4.76 శాతం తగ్గి 721.93 టన్నులకు చేరినా 2025-26 ఆర్థిక సంవత్సరంలో పసిడి దిగుమతుల బిల్లు 24 శాతం పెరగడం విశేషం. ఇదే కాలంలో వెండి దిగుమతులైతే 150 శాతం పెరిగి 1,200 కోట్ల డాలర్లకు (సుమారు రూ.1.11 లక్షల కోట్లు) చేరాయి. పరిమాణపరంగా చూసినా 2025-26 ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 7,334.96 టన్నులకు చేరాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 42 శాతం ఎక్కువ. బంగారం, వెండి దిగుమతుల భారంతో గత ఆర్థిక సంవత్సరం మన దేశ వాణిజ్య లోటు 3,332 కోట్ల డాలర్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మన దేశం దిగుమతి చేసుకున్న పసిడిలో 40 శాతం స్విట్జర్లాండ్‌ నుంచి దిగుమతైంది. యూఏఈ (16 శాతం), దక్షిణాఫ్రికా (10 శాతం) వరుసగా తరువాతి స్థానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

Updated Date - Apr 18 , 2026 | 05:06 AM