Share News

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

ABN , Publish Date - Apr 17 , 2026 | 08:08 PM

ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ హోర్ముజ్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. గతకొద్దిరోజుల నుంచి దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ హోర్ముజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించినా ట్రంప్ మాత్రం హోర్ముజ్ దిగ్బంధనం విషయంలో వెనక్కు తగ్గటం లేదు.

పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..

న్యూయార్క్, ఏప్రిల్ 17: గత కొంతకాలంగా ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్న హోర్ముజ్ జలసంధి సమస్య తీరిపోయింది. హోర్ముజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అమెరికాతో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందం పూర్తయ్యే వరకు హోర్ముజ్‌ను పూర్తిగా తెరిచే ఉంచుతామని తెలిపింది. హోర్ముజ్ జలసంధిలో ఇకపై అన్ని వాణిజ్య నౌకలకు ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తన ఎక్స్ ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టారు.


ఇరాన్‌కు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్..

హోర్ముజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేస్తూ ఇరాన్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ది ట్రూత్‌’లో వరుస పోస్టులు పెట్టారు. ఓ పోస్టులో.. ‘హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటన చేసింది. ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు.


అప్పటి వరకు అమల్లో దిగ్బంధనం..

ఇరాన్‌తో చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా సెంట్రల్ కమాండ్ హోర్ముజ్‌ను బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. గతకొద్దిరోజుల నుంచి దిగ్బంధనం కొనసాగుతోంది. ఇరాన్ హోర్ముజ్‌ను పూర్తిగా తెరుస్తున్నట్లు ప్రకటించినా ట్రంప్ మాత్రం హోర్ముజ్ దిగ్బంధనం విషయంలో వెనక్కు తగ్గటం లేదు. ఇరాన్‌తో అమెరికా లావాదేవీలు నూటికి నూరు శాతం పూర్తయ్యే వరకు పూర్తి స్థాయిలో దిగ్బంధనం అమల్లో ఉంటుందని తేల్చి చెప్పారు.


ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని మృతదేహం

వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు

Updated Date - Apr 17 , 2026 | 08:27 PM