Share News

విండీస్‌ విశ్వరూపం.. భారత్‌కు 406 పరుగుల టార్గెట్

ABN , Publish Date - Sep 30 , 2026 | 06:07 PM

గువాహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి టీమ్ఇండియాకు 406 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

విండీస్‌ విశ్వరూపం.. భారత్‌కు 406 పరుగుల టార్గెట్
IND Vs WI 2nd ODI

ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్‌ బ్యాటర్లు విశ్వరూపం చూపారు. ఓపెనర్ కార్టీ మినహా.. టాపార్డర్‌, పాటు మిడిలార్డర్‌ బ్యాటర్లు విరుచుకుపడటంతో భారీ స్కోరు సాధించింది విండీస్. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసి.. టీమ్ఇండియా ముందు 406 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది.


ఏకంగా మూడు శతకాలతో..

విండీస్‌ ఇన్నింగ్స్‌కు జాన్‌ క్యాంప్‌బెల్‌ చక్కటి శుభారంభం అందించాడు. అతడు కేవలం 68 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ(101)తో మెరిశాడు. అతడికి కెప్టెన్ షై హోప్‌ నుంచి సహకారమందింది. బెల్ ఔటయ్యాక.. హోప్‌ కూడా శతక మోత మోగించాడు. అతడు 94 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. మరోవైపు.. నాల్గో నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన అమిర్‌ జంగూ భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతడు 77 బంతుల్లోనే 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. అతడి ధాటికి విండీస్‌ స్కోరు 400కు చేరువైంది. చివర్లో రోస్టన్‌ చేజ్‌ 28 పరుగులతో రాణించగా.. షమర్‌ జోసెఫ్‌ 8 బంతుల్లో 16 పరుగులతో అజేయంగా నిలవడంతో.. 7 వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.

భారత్‌ బౌలర్లలో రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, గర్నూర్ బ్రార్ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు మినహా.. పేసర్లు 9కి పైగా ఎకానమీతో ధారళంగా పరుగులిచ్చుకున్నారు.


ఇవీ చదవండి:

ఆసియా క్రీడలు: కాంపౌండ్ ఆర్చరీలో భారత్‌కు మరో స్వర్ణం

టీమిండియాకు కొత్త చీఫ్ సెలెక్టర్.. రేసులో మాజీ స్టార్ స్పిన్నర్!

Updated Date - Sep 30 , 2026 | 06:23 PM