న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు బుమ్రా, పంత్ రెడీ.. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్!
ABN , Publish Date - Oct 26 , 2026 | 07:24 PM
న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సన్నద్ధమవుతున్నారు. త్వరలో మైదానంలోకి దిగేందుకు ఈ స్టార్ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ సన్నద్ధమవుతున్నారు. త్వరలో మైదానంలోకి దిగేందుకు ఈ స్టార్ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు న్యూజిలాండ్ ‘ఏ’ జట్టుతో నవంబర్ 7 నుంచి 10 వరకు లింకన్ వేదికగా జరగనున్న మూడో అనధికారిక టెస్టులో బుమ్రా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు ఓ స్పోర్ట్స్ నివేదిక వెల్లడించింది. అలాగే పంత్ కూడా బీసీసీఐ వైద్య బృందం ఇచ్చే ఫిట్‌నెస్ క్లియరెన్స్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రస్తుతం బుమ్రా, పంత్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. అక్టోబర్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్న బుమ్రా, ఆ తర్వాత వైట్-బాల్ సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్నాడు. తిరిగి జాతీయ జట్టులోకి ప్రవేశించే ముందు తప్పనిసరిగా పూర్తి చేయాల్సిన 'రిటర్న్-టు-ప్లే' ప్రక్రియలో భాగంగా అతడు ప్రస్తుతం సీవోఈ శిక్షణ శిబిరంలో ఉన్నాడు. నవంబర్ 1న బుమ్రా న్యూజిలాండ్‌కు బయలుదేరనున్నాడు.
మరోవైపు, అక్టోబర్ తొలి వారంలో జరిగిన ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టును విజయపథంలో నడిపించిన రిషభ్ పంత్.. ఆ సమయంలో అతడి పక్కటెముకలకు స్వల్ప గాయమైంది. దీంతో రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు, న్యూజిలాండ్ ‘ఏ’ జట్టుతో తొలి రెండు అనధికారిక టెస్టులకు పంత్ దూరమయ్యాడు. ప్రస్తుతం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రత్యేక శిక్షణ శిబిరంలో పంత్ తేలికపాటి బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే పంత్ న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొనడం పూర్తిగా మెడికల్ టీమ్ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుంది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నవంబర్ 19 నుంచి 23 వరకు వెల్లింగ్టన్ వేదికగా తొలి టెస్టు, నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు క్రైస్ట్‌చర్చ్‌లో రెండో టెస్టు జరగనున్నాయి. ఈ కీలక సిరీస్‌కు ముందు ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు ప్రాక్టీస్ మ్యాచ్ ద్వారా ఫామ్ అందుకోవడం జట్టుకు సానుకూలాంశమని క్రీడానిపుణులు అభిప్రాయాపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ప్రమాదకర పిచ్‌పై కోహ్లీ పట్టుదల గురించి డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
యువ ఆల్ రౌండర్ నమన్ ధీర్‌పై అజింక్య రహానే ప్రశంసలు..
పాక్ గడ్డపై డకెట్ అరుదైన రికార్డు.. తొలి ఇంగ్లాండ్ బ్యాటర్..!
రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి అరెస్ట్!