రూ.100 కోట్ల అవినీతి ఆరోపణలపై మాజీ మంత్రి అరెస్ట్!
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:37 PM
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళిని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్టు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. డీఎంకే సీనియర్ నేత, మాజీ విద్యా శాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళిని చెన్నైసెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అధికారులు అరెస్టు చేశారు. ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, గుర్తింపు విషయంలో రూ. 100 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
డీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు శాశ్వత గుర్తింపు, అప్‌గ్రేడేషన్, భవన నిర్మాణ అనుమతులు, నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOC) ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు భారీగా వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈ దర్యాప్తు ప్రారంభమైంది. తమిళనాడు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.టి. అరసుమ కుమార్ తదితరులు ఈ వసూళ్లకు పాల్పడినట్లు ప్రైవేట్ పాఠశాలల సమాఖ్య కార్యదర్శి ఇళంగోవన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దర్యాప్తులో భాగంగా డిజిటల్ పరికరాల ద్వారా సేకరించిన ఆధారాలు, పలువురి వాంగ్మూలాల ఆధారంగా డీఎంకే ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పని చేసినా అన్బిల్ మహేశ్ ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మహేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ఇవాళ(సోమవారం) కొట్టేసింది. హైకోర్టు బెయిల్ నిరాకరించిన గంటల వ్యవధిలోనే సీసీబీ ప్రత్యేక బృందాలు ఆయనను అరెస్టు చేశాయి. అయితే, తనపై వస్తున్న ఆరోపణలను మాజీ మంత్రి ఖండించగా.. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే టీవీకే పార్టీ అధికారిక యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తుందని డీఎంకే మండిపడింది. ఈ మొత్తం కుంభకోణంలో ప్రస్తావనకు వచ్చినా 177 పాఠశాలలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడా చదవండి:
కివీస్-ఎతో మ్యాచ్: 199 పరుగుల వద్ద ఔట్.. అంపైర్ నిర్ణయంపై పడిక్కల్ అసహనం!
కివీస్‌తో మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం.. వైభవ్‌కు మరో ఛాన్స్ దక్కుతుందా?
మ్యాచ్‌కు ముందురోజు రాత్రి జ్వరం.. పెయిన్‌కిల్లర్స్ వేసుకుని బరిలోకి: హర్మన్‌ప్రీత్