Share News

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వాఖ్యలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:08 PM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పేరు మార్చుకుని హీరోయిన్లతో దుబాయ్‌కు వెళ్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 26: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పేరు మార్చుకుని హీరోయిన్లతో దుబాయ్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. ఈరోజు సీఎల్పీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. ‘రామ్ కేటీగా, కే రామ్‌గా పేర్లు మార్చుకుని కేటీఆర్ దుబాయ్ వెళ్లారు. ఈ ప్రయాణంలో ఇద్దరు హీరోయిన్లు సహా నలుగురు ప్రముఖులు ఆయన వెంట ఉన్నారు. హీరోయిన్లతో పాటు హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్తే అందరికి తెలిసిపోతుంది కాబట్టి కేటీఆర్ బెంగళూరు, ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లారు’ అని బల్మూరి వెంకట్ ఆరోపణలు చేశారు.


అనంతరం కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. ‘వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం ఎందుకని ఓపిక పడుతున్నాను. ఇంట్లో బెంగళూరు, ఢిల్లీకి వెళ్తున్నాని అబద్ధాలు చెప్పి.. కేటీఆర్ దుబాయ్ వెళ్లారు. నేను చెప్పేది అబద్ధమని ఆయన తన కొడుకుపై ఒట్టేసి చెప్పగలరా..?’ అని ప్రశ్నించారు.

‘కేటీఆర్ ఒక రాక్షసుడు. ఆయనకు మహిళల ఉసురు తగులుతుంది. కేటీఆర్ కన్ను పడితే అంతా మటాషే. ఆయన కారణంగా తెలంగాణలో సినిమా తీయాలంటే నిర్మాతలు, డైరెక్టర్లు భయపడుతున్నారు. వారు వేరే రాష్ట్రాలకు వెళ్లి షూటింగ్ చేసుకుంటున్నారు’ అని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ మండిపడ్డారు.


కేసీఆర్‌పైనా ధ్వజం..

ఆ తరువాత బల్మూరి వెంకట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పలు విమర్శలు చేశారు. తెలంగాణ నీటి కొరతకు కారణం కేసీఆర్ అని ఆరోపించారు. గతంలో కేసీఆర్ వైసీపీ అధ్యక్షుడు జగన్‌తో మంతనాలు ఎందుకు నడిపారని ప్రశ్నించారు. ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా దగ్గర రొయ్యల పులుసు ఎందుకు తిన్నారని నిలదీశారు.


ఈ వార్తలూ చదవండి

తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర సీఎం సాకుకూలం.!

టీజీ-ఐపాస్‌ పోర్టల్‌లోని సమాచారం భద్రం

Updated Date - Oct 26 , 2026 | 05:12 PM