టీజీ-ఐపాస్ పోర్టల్‌లోని సమాచారం భద్రం
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:45 AM
సైబర్ దాడికి గురైన టీజీ-ఐపాస్ పోర్టల్‌ను పునరుద్ధరించామని, సమాచారం సర్వర్‌లో భద్రంగా ఉందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): సైబర్ దాడికి గురైన టీజీ-ఐపాస్ పోర్టల్‌ను పునరుద్ధరించామని, సమాచారం సర్వర్‌లో భద్రంగా ఉందని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబర్ భద్రతా ప్రమాణాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి వెల్లడించారు. మరింత పటిష్టమైన సైబర్ సెక్యూరిటీ ఫైర్‌వాల్స్‌తో వెబ్‌సైట్‌ను తీర్చిదిద్ది రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ నెల 22న టీజీ-ఐపాస్ పోర్టల్ సైబర్ దాడికి గురైన నేపథ్యంలో అధికారులు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News