రాష్ట్రంలో కరువు రావాలని కోరుకుంటున్న బీఆర్ఎస్ నేతలు: ఎంపీ చామల
ABN , Publish Date - Oct 26 , 2026 | 11:48 AM
రాజకీయం చేయాలనే ఆలోచనే తప్ప ప్రజలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రేమ లేదని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కరువు రావాలని ఆ పార్టీ కోరుకుంటుందని విమర్శించారు.
హైదరాబాద్, అక్టోబర్ 26: రాజకీయం చేయాలనే ఆలోచనే తప్పా ప్రజలపై బీఆర్ఎస్ పార్టీ నేతలకు ప్రేమ లేదని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో కరువు రావాలని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారని విమర్శించారు. అందుకోసం అబద్ధాలను వారు ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమాక్ లేని దివానా మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్త చేశారు.
గడ్డం పెంచి పెద్ద మనిషి అయ్యానని ఆయన అనుకుంటున్నారంటూ వ్యంగ్యంగా అన్నారు. మేడిగడ్డలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని పెదవి విరిచారు. ఎల్ నినో నేపథ్యంలో అక్టోబర్ 28వ తేదీన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. అందరి ఆలోచనల మేరకు నిర్ణయాం తీసుకుంటామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సొంత ఇలాకలో వైఎస్ జగన్‌కి గట్టి షాక్
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News