Share News

వాటర్‌ బోర్డు డైరెక్టర్‌ కారులో 2.40 లక్షల నగదు

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:51 AM

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎ్‌బీ) జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ కారులో రూ.2.40 లక్షల నగదు దొరికింది.

వాటర్‌ బోర్డు డైరెక్టర్‌ కారులో 2.40 లక్షల నగదు
ACB Hyderabad

  • సంతృప్తికర సమాధానం చెప్పని డైరెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌

  • లోక్‌ భవన్‌ సమీపాన అదుపులోకి

  • తీసుకుని విచారణ చేపట్టిన ఏసీబీ

హైదరాబాద్‌, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యూఎస్ఎ్‌బీ) జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ కారులో రూ.2.40 లక్షల నగదు దొరికింది. ఖైరతాబాద్‌లోని వాటర్‌బోర్డు కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఇంటికి కారులో వెళుతున్న శ్రీనివాస్‌ను లోక్‌ భవన్‌ సమీపంలో ఏసీబీ అధికారులు నిలిపి వేశారు. అటుపై ఆ కారులో సోదా చేయడంతో రూ.2.40 లక్షల నగదు బయట పడింది. వీటికి లెక్కలు చూపకపోవడంతోపాటు, సంతృప్తికరమైన సమాధానాలివ్వక పోవడంతో శ్రీనివా్‌సను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.


లెక్కల్లో చూపని అక్రమ నగదు విషయమై ఆదాయం పన్ను విభాగం అధికారులకు సమాచారం ఇచ్చామని ఏసీబీ హైదరాబాద్‌ రేంజ్‌-2 అధికారులు చెప్పారు. వాటర్‌ బోర్డులో ఓ ఉన్నతాధికారి తన కార్యాలయంలో వసూలు చేసుకున్న లంచం సొమ్మును పెద్ద మొత్తంలో కారులో తీసుకెళ్తున్నారని గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. శ్రీనివా్‌సను పట్టుకున్నారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వాటర్‌ బోర్డులోనూ విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు.. లంచాలు తీసుకున్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

సింగరేణిని కాపాడుకోవాలి

జనసేనతో పొత్తు వద్దే వద్దు!
Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:51 AM