Share News

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు

ABN , Publish Date - Oct 26 , 2026 | 06:04 AM

ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ డిమాండ్‌ చేయడం సరికాదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

డిండి ప్రాజెక్టును రద్దు చేయాలనడం సరికాదు
Gutha Sukhender Reddy

  • ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యలు తగవు

  • మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ డిమాండ్‌ చేయడం సరికాదని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేసేలా ఆ పార్టీ ఎంపీలు కృషి చేయాలని గుత్తా కోరారు. ముఖ్యంగా కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా సాధించేందుకు ప్రయత్నించాలని సూచించారు.


నదీజలాలను అవి ఏ జిల్లాలో ప్రవహిస్తే ఆ జిల్లాలకే పరిమితం చేయాలనే వాదనను ప్రశ్నించారు. నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి హైదరాబాద్‌ జంట నగరాలకు నల్లగొండ జిల్లా మీదుగా ఏటా దాదాపు 30 టీఎంసీల తాగునీటిని తరలిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నార్లాపూర్‌ నుంచి అదనంగా 0.60 టీఎంసీలు, డిండి ప్రాజెక్టుకు 0.50 టీఎంసీలు, అచ్చంపేట లిఫ్టుకు 0.01 టీఎంసీ నీటిని తరలించేలా నిర్ణయం తీసుకుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధులకు గుత్తా కృతజ్ఞతలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

కేటీఆర్‌.. నీ దొంగ ఏడుపులు చాలు

రేవంత్‌ పాలనలో వరుస స్కామ్‌లు

దివ్యాంగులు, మహిళల పెండింగ్‌ బిల్లులు.. రూ.16లక్షలు చెల్లించాలి: హరీశ్‌రావు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 06:04 AM