దివ్యాంగులు, మహిళల పెండింగ్ బిల్లులు.. రూ.16లక్షలు చెల్లించాలి: హరీశ్‌రావు
ABN , Publish Date - Oct 26 , 2026 | 06:00 AM
దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు.
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్న సంస్థకు రెండేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు మండిపడ్డారు. దివ్యాంగులు, నిరుపేద మహిళల కష్టార్జితాన్ని గుర్తించడంలేదని, ఇది సిగ్గుచేటని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన విమర్శించారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన జుబేదాబేగం దివ్యాంగ్ సోలార్ సొసైటీ.. దివ్యాంగ్ గార్మెంట్స్‌ను స్థాపించి దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఉపాధి కల్పిస్తోందన్నారు.
ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్లకు దుస్తులు కుట్టి సరఫరా చేసినందుకుగాను వారికి రావాల్సిన రూ.16లక్షల బిల్లులు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జీతాలు ఇవ్వలేక సతమతమవుతున్నారని, బ్యాంకు లోన్లు కట్టకపోవడంతో, సంస్థకు తాళాలు వేేస పరిస్థితి వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు తనతో ఆవేదన వెలిబుచ్చారని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రూ.16 లక్షల పెండింగ్ బిల్లులను విడుదల చేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేటీఆర్.. నీ దొంగ ఏడుపులు చాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News