చక్కదనంపై లుక్కేయని చుక్క
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:30 AM
అందంపై అనవసరపు మోజు తగ్గుతోందా? ముక్కు ఆకృతిని మార్చుకోవడం నుంచి శరీరంలో కొవ్వు తొలగించుకుని నాజూగ్గా మారే వరకు.. అందం కోసం సర్జరీలు, ఇతర చికిత్సలపై ఆధారపడేవారి ఆరాటం తగ్గుతోందా? తాజాగా వెల్లడైన ..
అందంపై అతివలకు తగ్గిన ఆరాటం!
ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్ చికిత్సల్లో 8.7 శాతం క్షీణత
సర్జరీ అవసరం లేని చికిత్సల్లో భారీగా తగ్గుదల
రొమ్ము సర్జరీల్లో మాత్రం 5.7 శాతం పెరుగుదల
భారత్‌లో 2025లో 10.61 లక్షల కాస్మెటిక్ చికిత్సలు
ఇందులో లైపోసక్షన్ టాప్.. మచ్చల తొలగింపునకు
ప్రాధాన్యం.. ఐఎస్ఏపీఎస్ గణాంకాలివీ..
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): అందంపై అనవసరపు మోజు తగ్గుతోందా? ముక్కు ఆకృతిని మార్చుకోవడం నుంచి శరీరంలో కొవ్వు తొలగించుకుని నాజూగ్గా మారే వరకు.. అందం కోసం సర్జరీలు, ఇతర చికిత్సలపై ఆధారపడేవారి ఆరాటం తగ్గుతోందా? తాజాగా వెల్లడైన ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఈస్థటిక్ ప్లాస్టిక్ సర్జరీ(ఐఎ్‌సఏపీఎస్)’ నివేదిక ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే ఇస్తోంది. కొన్ని దశాబ్దాలుగా అందం కోసం ఆశ్రయిస్తున్న కాస్మెటిక్ సర్జరీలు, చికిత్సల సంఖ్య ఇటీవలికాలంలో తగ్గుముఖం పడుతోందని వెల్లడించింది. 2024తో పోల్చితే 2025లో మొత్తంగా కాస్మెటిక్ చికిత్సలు 8.7శాతం తగ్గాయని, ముఖ్యంగా శస్త్రచికిత్సలు అవసరంలేని నాన్-సర్జికల్ విధానాల్లో 15.7 శాతం క్షీణత ఉందని తెలిపింది. ఇక శస్త్రచికిత్సల్లో ముఖం, తల సంబంధిత ప్రక్రియలు 3.2 శాతం పెరగ్గా.. బ్రెస్ట్ సర్జరీలు 5.7 శాతం వృద్ధి చెందాయి.
మిగతా సర్జరీలు 8.9 శాతం తగ్గాయి. నాన్-సర్జికల్ విభాగంలో ఇంజెక్టబుల్ చికిత్సలు 16.2 శాతం, ఫేషియల్ రీజువెనేషన్ ప్రక్రియలు 0.8 శాతం తగ్గాయి. ఇతర కాస్మెటిక్ ప్రక్రియల్లో 29.3 శాతం క్షీణత నమోదైంది. ఇక గతేడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన కాస్మెటిక్ సర్జరీల్లో 15శాతం కేవలం వక్షోజాల పరిమాణం పెంచేవి (బ్రెస్ట్ ఆగ్మెంటేషన్), వాటి ఆకృతిని సరిచేసే( బ్రెస్ట్ లిఫ్ట్) సర్జరీలే ఉండటం గమనార్హం. ఐఎ్‌సఏపీఎస్ సంస్థ గత ఏడాది 51 దేశాల్లో జరిగిన కాస్మెటిక్ సర్జరీలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించింది. ఈ సర్వే ప్రకారం 2025లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1,78,83,610 కాస్మెటిక్ సర్జరీలు, 1,73,20,420 సర్జరీ అవసరం లేని కాస్మెటిక్ చికిత్సలు జరిగాయి. 2024తో పోలిస్తే ముఖ్యంగా బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీలు 48.1 శాతం పెరిగాయి. కనురెప్పల సర్జరీలు 16.2 శాతం పెరిగితే... శరీరం నుంచి కొవ్వును తొలగించే లైపోసక్షన్ 11.4 శాతం, ముక్కు సర్జరీలు 6.3 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా కాస్మెటిక్ చికిత్సల్లో అమెరికాలో టాప్‌లో ఉండగా, భారత్ పదోస్థానంలో నిలిచింది.
పురుషుల్లోనూ కాస్మెటిక్ సర్జరీలు
ప్రపంచవ్యాప్తంగా పురుషులు కూడా ముఖ సౌందర్యం, శరీర ఆకృతిలో మార్పుల కోసం వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోవడం పెరిగిందని అధ్యయనం పేర్కొంది. పురుషులు అత్యధికంగా చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీలలో కనురెప్పలపై భాగం సర్జరీ (5,48,407 సర్జరీలు) అగ్రస్థానంలో ఉండగా, తర్వాత గైనెకోమాస్టియా (పురుషుల్లో రొమ్ము కణజాలం తగ్గించే సర్జరీ)(2,82,954), ముక్కు ఆకృతి మార్చే సర్జరీ (2,47,477) లైపోసక్షన్ (2,37,835), మచ్చల తొలగింపు సర్జరీ(1,88,691) ఉన్నాయి.
పురుషుల్లోనూ కాస్మెటిక్ సర్జరీలు
ప్రపంచవ్యాప్తంగా పురుషులు కూడా ముఖ సౌందర్యం, శరీర ఆకృతిలో మార్పుల కోసం వివిధ రకాల శస్త్రచికిత్సలు చేయించుకోవడం పెరిగిందని అధ్యయనం పేర్కొంది. పురుషులు అత్యధికంగా చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీలలో కనురెప్పలపై భాగం సర్జరీ (5,48,407 సర్జరీలు) అగ్రస్థానంలో ఉండగా, తర్వాత గైనెకోమాస్టియా (పురుషుల్లో రొమ్ము కణజాలం తగ్గించే సర్జరీ)(2,82,954), ముక్కు ఆకృతి మార్చే సర్జరీ (2,47,477) లైపోసక్షన్ (2,37,835), మచ్చల తొలగింపు సర్జరీ(1,88,691) ఉన్నాయి.
భారత్‌లో 10 లక్షల సౌందర్య చికిత్సలు
మన దేశంలో 2025లో మొత్తం 10,61,480 సౌందర్య చికిత్సలు జరిగినట్లు ఐఎ్‌సఏపీఎస్ అంచనా వేసింది. అందులో 5,74,840 శస్త్రచికిత్సలుకాగా, 4,86,640 శస్త్రచికిత్స అవసరం లేని చికిత్సలు ఉన్నాయి. శస్త్రచికిత్సల్లో శరీర భాగాలకు సంబంధించిన సర్జరీలు 2,28,480 (39.7 శాతం) ఎక్కువ. ముఖం, తలభాగానికి సంబంధించినవి 1,99,080 (34.6 శాతం), రొమ్ము సర్జరీలు 1,47,280 (25.6 శాతం)గా నమోదయ్యాయి. మొత్తంగా భారత్‌లో లైపోసక్షన్ టాప్‌లో ఉంది.
ప్రపంచవ్యాప్తంగా లైపోసక్షన్ సర్జరీల్లో భారత్ వాటా 4.2 శాతంగా ఉంది. ఇక ఇంజెక్షన్లు, చర్మ సౌందర్య చికిత్సలు, హెయిర్ రిమూవల్ వంటి నాన్ సర్జికల్ ప్రక్రియలు కూడా భారత్‌లో పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. అందులో రోమాల శాశ్వత తొలగింపు (1,51,480 చికిత్సలు), ముఖభాగంలో ఆకృతి కోసం ఇచ్చే హైలూరోనిక్ యాసిడ్ ఫిల్లర్స్(73,920), చర్మంలో ముడతలను తగ్గించే బొటాక్స్ (72,240), కెమికల్ పీల్ ( 63,560), నాన్ సర్జికల్ స్కిన్ టైటెనింగ్ (51,240 చికిత్సలు) ఉన్నాయి. ఈ లెక్కల్లో హెయిర్ రిమూవల్ చికిత్సలు 31.1 శాతంతో మొదటి స్థానంలో ఉన్నాయి. కాగా, కాస్మెటిక్ సర్జరీల ఖర్చులు, ఇతర అంశాలను ఈ అధ్యయనం ప్రస్తావించలేదు.
ప్రపంచవ్యాప్తంగా టాప్-10 కాస్మెటిక్ సర్జరీలు
శస్త్రచికిత్స | సర్జరీల సంఖ్య |
కనురెప్పల సర్జరీ | 24,57,677 |
శరీరంలోని కొవ్వు తొలగింపు | 18,49,828 |
రొమ్ముల పరిమాణం పెంచే సర్జరీ | 16,22,639 |
రొమ్ముల ఆకృతి సరిచేసే సర్జరీ | 11,43,862 |
పొట్టభాగంలో అదనపు చర్మం, కొవ్వు తొలగింపు | 10,39,808 |
ముక్కు ఆకృతి సరిచేసే సర్జరీ | 10,15,685 |
ముఖానికి కొవ్వుమార్పిడి (ఫేస్-ఫ్యాట్‌గ్రాఫ్టింగ్) | 9,44,410 |
ముఖం, చర్మంపై మచ్చల తొలగింపు | 7,60,005 |
ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడం | 7,38,945 |
కనుబొమ్మల పైభాగాన్ని సరిచేయడం | 6,47,725 |
2025లో సౌందర్య చికిత్సలు జరిగిన టాప్ దేశాలు
దేశం | మొత్తం చికిత్సలు |
అమెరికా | 54,61,476 |
బ్రెజిల్ | 32,16,665 |
చైనా | 28,44,500 |
జపాన్ | 20,47,901 |
దక్షిణ కొరియా | 19,66,442 |
జర్మనీ | 15,25,462 |
ఇటలీ | 14,77,556 |
మెక్సికో | 14,69,794 |
తుర్కియే | 13,18,980 |
భారత్ | 10,61,480 |
భారత్‌లో టాప్-5 సౌందర్య సర్జరీలు
సర్జరీ | చికిత్సల సంఖ్య |
లైపోసక్షన్ | 77,840 |
మచ్చలు తొలగింపు | 61,880 |
రొమ్ముల పరిమాణం పెంచే సర్జరీ | 54,040 |
ముక్కు ఆకృతి సరిచేసే సర్జరీ | 52,640 |
కనురెప్పలపై భాగాన్ని సరిచేసే సర్జరీ | 38,080 |
ఈ వార్తలు కూడా చదవండి:
పీర్జాదిగూడలో ఆర్థిక మోసగాడి అరెస్టు
Read Latest AP News And Telangana News And International News And Telugu News