వారిద్దరూ నా మీద చాలా నమ్మకం ఉంచారు: అభిషేక్ శర్మ
ABN , Publish Date - Feb 27 , 2026 | 08:17 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు డకౌటైన సంగతి తెలిసిందే. అతడి బ్యాటింగ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఫామ్ అందుకుని జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా అభిషేక్ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో టీమిండియా స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ వరుసగా మూడు సార్లు డకౌటైన సంగతి తెలిసిందే. అతడి బ్యాటింగ్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఎట్టకేలకు ఫామ్ అందుకుని జింబాబ్వేపై హాఫ్ సెంచరీ చేశాడు. ఈ సందర్భంగా విఫలమైనా సరే అవకాశాలు ఇచ్చిన ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు తన హాఫ్ సెంచరీని టీమ్‌కు అంకితం చేస్తున్నట్లు అభిషేక్ శర్మ తెలిపాడు. ఇప్పుడు తనకు ఎంతో రిలీఫ్‌గా ఉందని చెప్పుకొచ్చాడు.
‘నా కంటే సహచర క్రికెటర్లకే నాపై నమ్మకం ఎక్కువగా ఉంది. హాఫ్ సెంచరీ చేశాక భావోద్వేగానికి గురయ్యా. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించేందుకు ప్రయత్నించా. అయినా నా బెస్ట్ ఇంకా రాలేదు. టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా అద్భుతంగా ఉంది. మేమంతా టీమ్‌లా కాకుండా.. కుటుంబంలా ఉంటాం. అందుకే నా నుంచి బెస్ట్ గేమ్ రావాలనేది వారి ఆకాంక్ష. ఆరోజు తప్పకుండా వస్తుందని భావిస్తున్నా. నేనూ దానికోసం వేచి చూస్తున్నా.
నేను టీ20 ప్రపంచ కప్‌లో అడుగు పెట్టేటప్పుడు నా ఆరోగ్యం కూడా అంత బాలేదు. అంతకుముందు ఆసుపత్రిపాలయ్యా. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో దేశం కోసం తొలి మ్యాచ్ ఆడేటప్పుడు మంచి ఆరంభం దక్కాలని కోరుకున్నా. కానీ అలా జరగలేదు. అయినా సరే జట్టు సభ్యుల నుంచి ఇప్పటికీ అదే సపోర్ట్. మరీ ముఖ్యంగా ప్రధాన కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్య నాపై చాలా నమ్మకం ఉంచారు. ఇంకో మ్యాచ్‌లో సున్నా చేసినా సరే పక్కన పెట్టేది లేదని.. జట్టు కోసం మరిన్ని విజయాలు అందించాలని చెప్పారు. జట్టుక ఎంతో ముఖ్యమైన ప్లేయర్‌గా నన్ను భావించారు. అందుకే జింబాబ్వేపై హాఫ్ సెంచరీని నేను నా జట్టు సహచరులు, కోచ్, కెప్టెన్‌కు అంకితం చేశా’ అని అభిషేక్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్