Share News

మూడు వన్డేల సిరీస్: రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:08 PM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ పోరులో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలోనూ గెలుపొందడంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది.

మూడు వన్డేల సిరీస్: రెండో మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి.. సిరీస్ ఆసీస్‌దే
Australia Women vs India Women

ఇంటర్నెట్ డెస్క్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు రెండో మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ పోరులో ఆసీస్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలి వన్డేలోనూ గెలుపొందడంతో మరో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను 2-0తో దక్కించుకుంది. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్.. 36.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్ జార్జియా వాల్(101; 82 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగింది.


ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్(80) అద్భుతంగా రాణించింది. బెత్ మూనీ(31) పర్వాలేదనిపించింది. కెప్టెన్ అలీసా హీలీ(6), సదర్లాండ్(10) నిరాశపర్చారు. ఆష్లీ గార్డ్‌నర్(19*), మెక్‌గ్రాత్(0*) నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో కాష్వీ గౌతమ్ 2, దీప్తి శర్మ 2, క్రాంతి గౌడ్ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. గాయం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన ప్రతీకా రావల్(52) హాఫ్ సెంచరీతో మెరిసింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(54) కూడా అర్ధ శతకం చేసింది. స్మృతి మంధాన(31), రిచా ఘోష్(22),కాష్వీ గౌతమ్(25) పర్వాలేదనిపించారు. జెమీమా రోడ్రిగ్స్(11), దీప్తి శర్మ(1), అమన్‌జ్యోత్(13) విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆష్లీ గార్డ్‌నర్ 2, సదర్లాండ్ 2, అలాన్ కింగ్ 2, మెగాన్ 1, కేరీ 1 వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

Updated Date - Feb 27 , 2026 | 04:43 PM