Share News

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్

ABN , Publish Date - Feb 27 , 2026 | 02:25 PM

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. కాగా టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు

టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో జింబాబ్వేతో జరిగిన కీలక పోరులో టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో జింబాబ్వే ఈ టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వగా.. భారత్ తన సెమీస్ ఆశలు సజీవంగా మార్చుకుంది. కాగా టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆనందం వ్యక్తం చేశాడు. కీలక పోరులో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాను ప్రశంసించాడు.


‘కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో టీమిండియా సత్తా చాటింది. 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రస్తుత ప్రపంచ కప్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోర్. జింబాబ్వేపై అద్భుతంగా ఆడింది. టీమిండియా ఇదే రిథమ్‌ను కొనసాగించాలి. ఈ టోర్నమెంట్‌లో చక్కటి ప్రదర్శనలు చేసిన జింబాబ్వేకు అభినందనలు’ అని సచిన్ ఎక్స్ వేదికగా స్పందించాడు.


లీగ్ స్టేజీని అజేయంగా ముగించిన టీమిండియా.. సూపర్ 8లో తొలి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికాపై ఓడిన విషయం తెలిసిందే. దీంతో సెమీస్ ఆశలను కాస్త సంక్లిష్టం చేసుకుంది. తాజాగా జింబాబ్వేతో పోరులో పై చేయి సాధించి తన ఆశలు సజీవంగా నిలుపుకుంది. కాగా సూపర్ 8లో భాగంగా టీమిండియా ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే.. సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. వెస్టిండీస్‌పై కూడా టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి సెమీస్‌కు దూసుకెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి:

కీలక మ్యాచ్‌లో గెలిచినా.. ఆందోళనలో టీమిండియా అభిమానులు!

విషాదం: భారత క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత..

Updated Date - Feb 27 , 2026 | 02:25 PM