రంజీ ట్రోఫీ ఫైనల్: నాలుగో రోజు ముగిసిన ఆట.. 447 పరుగుల ఆధిక్యంలో జమ్ము కశ్మీర్
ABN , Publish Date - Feb 27 , 2026 | 05:53 PM
రంజీ ట్రోఫీ ఫైనల్‌లో భాగంగా హుబ్లీ వేదికగా కర్ణాటక-జమ్మూ కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్‌లో బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ భారీ స్కోర్ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీ ఫైనల్‌లో భాగంగా హుబ్లీ వేదికగా కర్ణాటక-జమ్ము కశ్మీర్ జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్‌లో బ్యాటింగ్ చేస్తోన్న జమ్మూ భారీ స్కోర్ ఆధిక్యం సాధించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. తొలి సెషన్ స్కోర్ కలుపుకుని కర్ణాటకపై మొత్తంగా 477 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఓపెనర్ ఖమర్ ఇక్బాల్(94*), సాహిల్ లోత్రా(16*) క్రీజులో ఉన్నారు.
హస్సన్(1), శుభమ్ పుందిర్(4), పరాస్ డోగ్రా(16) విఫలమయ్యారు. అబ్దుల్ సమాద్(32) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 2, విజయ్ కుమార్ వైశాఖ్ 1, శ్రేయాస్ గోపాల్ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు తొలి సెషన్‌లో కర్ణాటక 293 పరుగులకు ఆలౌటైంది. మయాంక్ అగర్వాల్(160) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. మయాంక్ నాక్ వల్లే ఆ మాత్రం స్కోర్ అయినా కర్ణాటక చేయగలిగింది. జమ్మూ బౌలర్లలో ఆకిబ్ నబీ దార్ 5 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సునీల్ కుమార్ 2, యుద్విర్ 2, సాహిల్ లోత్రా 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
వరుస డకౌట్లకు చెక్.. అభిషేక్ ఫామ్ అందుకోవడానికి కారణం అదే!
టీమిండియా కీలక పోరులో సత్తా చాటింది: సచిన్ టెండూల్కర్