ప్రేమికుల రోజే ప్రియుడితో పట్టుబడిన భార్య.. చివరకు?
ABN , Publish Date - Feb 15 , 2026 | 11:27 AM
ఉత్తర్‌ప్రదేశ్ హాపూర్ జిల్లాలో ప్రేమికుల రోజు ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె తన ప్రియుడితో ఉండటాన్ని భర్త స్వయంగా చూసి.. ఇద్దరినీ చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్(Hapur) జిల్లాలో ఓ మహిళకు చేదు అనుభవం ఎదురైంది. ప్రేమికుల రోజు నాడు ఒక భర్త.. తన భార్యను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. హాపూర్‌లోని మీరట్ రోడ్డులో భార్య, తన ప్రియుడితో కలిసి బైక్‌పై తిరగడం భర్త చూశాడు. వెంటనే వారిని అక్కడే ఆపాడు. దీంతో ప్రియుడు, భర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడున్న వారు కూడా భర్తకు మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే స్థానికులు ప్రియుడిని చితకబాదారు. పక్కనున్న వారు ఈ అంశాన్ని గమనిస్తూ.. మొబైల్లో రికార్డ్ చేశారు. అది కాస్తా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. భర్త ఆరోపణలతో ప్రియుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
మీరట్‌కు చెందిన ఓ యువకుడికి ఇటీవల వివాహం జరిగింది. కానీ ఆమె అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిసింది. ప్రేమికుల రోజైన శనివారం వీరిద్దరూ రోడ్లపై షికార్లు కొడుతూ పట్టుబడటం, కేసు నమోదు కావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తతలు.. పలు పోలింగ్ కేంద్రాల్లో ఘర్షణలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ విభజన
Read Latest Telangana News And AP News And Telugu News