Share News

కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి

ABN , Publish Date - Feb 15 , 2026 | 07:15 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తుండడం స్థానికంగా కలకలం రేపింది.

కొత్తగూడెం జిల్లాలో పెద్దపులి

  • కరకగూడెంలో పాదముద్రల గుర్తింపు

  • ఆందోళనలో స్థానికులు, రైతులు

కరకగూడెం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో రెండు రోజులుగా పెద్దపులి సంచరిస్తుండడం స్థానికంగా కలకలం రేపింది. అటవీ ప్రాంత గ్రామాల్లో పులి అడుగుజాడలు కనిపించడంతో రైతులు, పశువుల కాపరులు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం ఉమ్మడి పినపాక మండలం టి.కొత్తగూడెంలో, శనివారం కరకగూడె మండలం నారాయణపేట సమీపంలోని జామాయిల్‌ తోటలో పులి పాదముద్రలను అటవీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై అటవీ శాఖ రేంజర్‌ తేజస్వీని వివరణ కోరగా.. పులి ప్రస్తుతం కిన్నెరసాని అభయారణ్యం వైపు వెళ్లే అవకాశం ఉందన్నారు. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లొద్దని సూచించారు.

Updated Date - Feb 15 , 2026 | 07:15 AM