సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో అర్థం కావట్లేదా.. ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..
ABN , Publish Date - Mar 17 , 2026 | 01:56 PM
ప్రస్తుతం ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే గుండెలు గుబేల్‌మనే పరిస్థితి నెలకొంది. సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలిస్తే.. ముందే జాగ్రత్త పడొచ్చు. ఇందుకోసం ఓ యువతి సింపుల్ చిట్కాను ట్రై చేసింది..
ప్రస్తుతం గ్యాస్ సమస్య దేశ ప్రజలను పట్టి పీడిస్తోందని చెప్పొచ్చు. ఇరాన్-ఇజ్రాయెల్- అమెరికా.. యుద్ధ ప్రభావం మన దేశంలో ప్రధానంగా గ్యాస్ సరఫరాపై పడింది. చాలా మంది గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరైతే.. తమ ఇంట్లో గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో.. తర్వాత దొరుకుతుందో లేదో అనే ఆందోళనతో ఉన్నారు. సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలిస్తే ముందే జాగ్రత్త పడేందుకు అవకాశం ఉంటుంది. అయితే చాలా మందికి అది ఎలా కనుక్కోవాలో తెలీదు. సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలుసుకునేందుకు ఓ యువతి సింపుల్ ట్రిక్ చూపించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్.. వాటెన్ ఐడియా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఇంట్లో గ్యాస్ అయిపోయిందంటే గుండెలు గుబేల్‌మనే పరిస్థితి నెలకొంది. సిలిండర్‌లో గ్యాస్ ఎంతుందో తెలిస్తే.. ముందే జాగ్రత్త పడొచ్చు. ఇందుకోసం ఓ యువతి సింపుల్ చిట్కాను ట్రై చేసింది. తడి బట్టతో సిలిండర్‌పై రుద్దింది. ఆ తర్వాత రెండు నిముషాలు వేచి చూడగా.. సిలిండర్‌పై ఉన్న తేమ సగం ఆరిపోయింది. కింద నుంచి పై సగం వరకూ తేమ అలాగే ఉంది.
సిలిండర్‌పై తేమ ఎంతవరకూ ఉందో.. లోపల గ్యాస్ కూడా (Trick to know how much gas is in cylinder) అంతవరకూ ఉన్నట్లు దీని అర్థం. ఇలా సిలిండర్‌లో ఉన్న గ్యాస్‌ను సింపుల్‌గా తెలుసుకోవచ్చన్నమాట. ఈ ఐడియా ఇంతవరకూ ఇంకా చాలా మందికి తెలీదనే చెప్పొ్చ్చు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘మాకైతే సిలిండర్‌ను పైకి ఎత్తగానే సులభంగా తెలిసిపోతుంది’.. , ‘ఇవన్నీ అవసరం లేదు.. గ్యాస్ అయిపోగానే ఆలోమేటిక్‌గా స్టవ్ ఆగిపోతుంది’.., ‘గ్యాస్ ఎంతుందో తెలిసేకంటే.. ఇలా చేయడం వల్ల సిలిండర్ శుభ్రమవుతుంది’.., అంటూ కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.9 లక్షలకు పైగా లైక్‌లు, 21 మిలియన్ల వరకూ వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
గ్యాస్ లేదని ఎలక్ట్రిక్ స్టవ్ కొన్నాడు.. తీరా కూర ఉడికే ముందు చూసి ఖంగుతిన్నాడు..
వీరి తెలివి మామూలుగా లేదుగా.. రైల్వే ఏసీ కోచ్‌ను ఎలా మార్చారో చూడండి..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..