సింహాలు బోనులో ఉన్నాయి కదా అని నిర్లక్ష్యంగా ఉంటే అంతే.. ఈ బాలికకు ఏమైందంటే..
ABN , Publish Date - Mar 01 , 2026 | 04:28 PM
జూలోని జంతువులను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. అంతా జంతువులను ఆసక్తిగా చూస్తుండగా.. సింహం బోను వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సింహం బోను వద్ద నిలబడ్డ ఓ బాలిక.. దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో..
పులులు, సింహాల పేరు వింటేనే ఒంట్లో ఒణుకు పుడుతుంది. అయితే అవే క్రూర మృగాలు బోనులో ఉంటే మాత్రం, చాలా మంది వాటితో ఆటలాడుతుంటారు. బోనులో ఉండే జంతువులు ఏం చేస్తాయనే ఉద్దేశంతో వాటి సమీపానికి వెళ్లడం, వాటి తలపై చేయి పెట్టడం, కర్రలతో కొట్టడం వంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అయితే ఈ పనులు కొన్నిసార్లు బెడిసికొడుతుంటాయి. బోనులో చేతులు పెట్టగానే.. సింహాలు, పులులు వాటిని లాగేస్తుంటాయి. ఈ క్రమంలో కొందరు తీవ్రగాయాలపాలైతే.. మరికొందరు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ బాలిక సింహం బోను సమీపానికి వెళ్లడంతో చివరకు ఏమైందో చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. జూలోని జంతువులను చూసేందుకు చాలా మంది పర్యాటకులు వచ్చారు. అంతా జంతువులను ఆసక్తిగా చూస్తుండగా.. సింహం బోను వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సింహం బోను వద్ద నిలబడ్డ ఓ బాలిక.. దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో అత్యంత సమీపానికి వెళ్లింది. ఈ క్రమంలో సింహం తన ముందు కాలిని.. ఇనుప కడ్డీల సందులో నుంచి బయటికి పెట్టి, బాలిక కాలును పట్టుకోబోయింది. అయితే ఈ క్రమంలో ఆ దాని పంజా గోర్లకు బాలిక ప్యాంట్ తగులుకుంది.
ఆ సింహం బాలిక ప్యాంట్‌ను పట్టుకుని (Lion pulls girl's pant) గట్టిగా లాగేసింది. ఇంతలో అక్కడే ఉన్న బాలిక తండ్రి గమనించి, వెంటనే అలెర్ట్ అయ్యాడు. బాలిక కాలు పట్టుకుని దూరంగా లాగాడు. మరోవైపు సింహం కూడా బాలిక ప్యాంట్‌ను పట్టుకుని లాగేస్తోంది. దీంతో ఆ తండ్రి మరింత గట్టిగా లాగేయడంతో చివరకు సింహం పంజా నుంచి బాలిక తప్పించుకుంది. కాసేపు గమనించకుండా ఉండి ఉంటే.. పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. బాలికకు ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివి రకాలుగా స్పందిస్తున్నారు. ‘పక్కన ఉన్న వారు చూస్తున్నారు తప్ప.. బాలికను కాపాడే ప్రయత్నం చేయకపోవడం దారుణం’.. అంటూ కొందరు, ‘ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41 వేలకు పైగా లైక్‌లు, 3.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
అయ్యో పాపం.. ఊరేగింపులో ఏనుగును సిద్ధం చేస్తుండగా ఏమైందో చూడండి..
కారు ఆపి దోచుకోవాలని చూసిన దొంగలు.. కత్తితో వెంటపడిన విదేశీ మహిళ.. చివరకు..
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..