మరుగుతున్న మసాలా టీలో ఐఫోన్ 18 ప్రో మాక్స్.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:59 AM
కొత్త ఐఫోన్‌ను పరీక్షించడానికి కొందరు వింత ప్రయోగానికి తెరలేపారు. వేడి వేడి టీలో ఫోన్ వేసి మరగబెట్టారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: టీలో అల్లం వేసే వారినీ చూస్తుంటాం.. బెల్లం వేసే వారినీ చూస్తుంటాం. టీలో ఐఫోన్ వేసి మరగబెట్టడం ఎప్పుడైనా చూశారా..? అదే చేశారు కొందరు వ్యక్తులు. ఎందుకోసం అనుకుంటున్నారా..? తమ ఐఫోన్‌ను పరీక్షించుకోవడానికి ఈ పని చేశారు. కొత్తగా కొన్న ఐఫోన్ సామర్థ్యాన్ని తెలుసుకోవాలనుకున్న వారు.. ఈ వింత ప్రయోగానికి తెరలేపారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
వీడియోలో కొందరు టీ తయారు చేసుకుంటూ కనిపిస్తారు. వారి చేతిలో ఐఫోన్18 ప్రో మాక్స్ ఉంటుంది. టీ బాగా మరిగి పొగలు వస్తున్నప్పుడు వారు ఒక్కసారిగా ఐఫోన్‌ను అందులో వేసేస్తారు. 60 సెకన్ల నుంచి 90 సెకన్ల వరకూ ఆ ఐఫోన్ వేడి వేడి టీలో మరుగుతుంది. తర్వాత ఫోన్‌ను బయటికి తీసి, పని చేస్తుందో లేదో చెక్ చేస్తారు.
టీలో వేసి వేడి చేసినా ఆ ఫోన్ పనిచేస్తున్నట్టు కనిపించింది. అయితే కెమెరా మాత్రం మసకగా మారిపోయింది. అలాగే మొబైల్‌పై పలు పగుళ్లు, గీతలూ పడ్డాయి. ఇదంతా ఫోన్ తయారీ నాణ్యతను, బలాన్ని పరీక్షించడానికి చేశామని ఈ బృందం చెబుతోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘ఐఫోన్‌తో పెట్టిన టీ మరింత రుచిగా ఉంటుంది కాబోలు’ అని ఓ వ్యక్తి కామెంట్ పెట్టారు. ఈ కొత్తరకం ప్రయోగం సోషల్ మీడియా యూజర్లను ఆశ్చర్యపరిచింది.
ఈ వార్తలూ చదవండి
తీర్థయాత్రలో తప్పిపోయిన వృద్ధుడు.. కలిపిన చాట్‌జీపీటీ
సెలూన్‌లో కోతికి మసాజ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు.