అర్ధరాత్రి యువతికి వీడియో కాల్.. ఆపై ఉరేసుకున్న కానిస్టేబుల్
ABN , Publish Date - Sep 21 , 2026 | 10:50 AM
హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 21: నగరంలోని మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్(35) ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే చనిపోయే ముందు అర్ధరాత్రి ఓ యువతికి కానిస్టేబుల్ వీడియో కాల్ చేసినట్లు తెలుస్తోంది. తాను ఉరేసుకుంటున్నట్లు యువతికి చెప్పాడు. ఆందోళనకు గురైన యువతి వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చింది. చైతన్యపురి పోలీసులు.. మలక్‌పేట్ పోలీసులకు విషయాన్ని తెలియజేయటంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకున్నారు.
ఇంట్లోకి వెళ్లి చూడగా అప్పటికే కానిస్టేబుల్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు చంద్రశేఖర్ అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే కానిస్టేబుల్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్
జూరాల ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయాలి: డీకే అరుణ
Read Latest Telangana News And Telugu News