Share News

జూరాల ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయాలి: డీకే అరుణ

ABN , Publish Date - Sep 21 , 2026 | 10:36 AM

కాంగ్రెస్ ప్రభుత్వంపై మహబూబ్‌ నగర్ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ఆయకట్టు రైతాంగానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జూరాల ఆయకట్టు రైతాంగానికి నీటిని విడుదల చేయాలి: డీకే అరుణ
MP DK Aruna

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 21: కాంగ్రెస్ ప్రభుత్వంపై మహబూబ్‌ నగర్ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ఆయకట్టు రైతాంగానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు(సోమవారం) ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. ప్రస్తుతం రైతాంగం నీటి కోసం అల్లాడుతుంటే.. ఎండాకాలం బూచి చూపడం సమంజసం కాదని మండిపడ్డారు. జూరాలలో ఇప్పటికీ నీరు సమృద్ధి గానే ఉందని తెలిపారు. ఎండా కాలానికి ఇక్కట్లు వస్తే.. ఎగువన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందని.. అప్పుడు నీటిని విడుదల చేయించుకోవచ్చని సలహా ఇచ్చారు. ప్రస్తుతం కృష్ణా నదికి ఇంకా వరద వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. రైతులు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. రైతుల ఆందోళనకు అండగా నిలుస్తామని ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు.


నిన్న(ఆదివారం) జూరాల ప్రాజెక్ట్ కింద కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జూరాల డ్యాం గద్వాల-ఆత్మకూరు రహదారిపై, కర్నూల్-గద్వాల రహదారిపై, కలెక్టరేట్ ముందు రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు బీజేపీ నేతలు మద్దతు తెలియజేశారు. అంతేకాకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎంపీ డీకే అరుణ ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. జూరాల ఆయకట్టు రైతాంగానికి సాగునీటిని విడుదల చేయాలని.. సాగు చేసిన పంటలను కాపాడాలని వినతి చేశారు.


ఇవి కూడా చదవండి...

రూ.200 చిల్లర విషయంలో వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య..

ప్రజా ఉద్యమాల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిది: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 10:36 AM