Share News

హైదరాబాద్‌లో స్కూల్ బస్సు బీభత్సం.. మూసీ నదిలోకి దూసుకెళ్లి..

ABN , Publish Date - Sep 21 , 2026 | 09:36 AM

హైదరాబాద్‌‌లోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్కూల్‌ బస్సు అదుపుతప్పి మూసీ నదిలోకి దూసుకెళ్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బస్సులో ఉన్న చిన్నారులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

హైదరాబాద్‌లో స్కూల్ బస్సు బీభత్సం.. మూసీ నదిలోకి దూసుకెళ్లి..
Hyderabad School Bus Accident

హైదరాబాద్‌, సెప్టెంబర్ 21: నగరంలోని రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్కూల్‌ బస్సు అదుపుతప్పి మూసీ నదిలోకి దూసుకెళ్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో బస్సులో ఉన్న చిన్నారులు.. స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో ఉన్న చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.


స్కూల్‌ బస్సు రోడ్డుపై నుంచి అదుపుతప్పి మూసీనదిలోకి దూసుకెళ్లడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ నిర్లక్ష్యమా.. లేక వాహనం అదుపుతప్పడానికి మరేదైనా కారణమా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు.. తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

దీపాలకేనా.. హాస్టళ్లకు నిధులు ఉండవా ?

అతి వేగంతో అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు

Updated Date - Sep 21 , 2026 | 09:43 AM