అతి వేగంతో అదుపు తప్పిన బీఎండబ్ల్యూ కారు
ABN , Publish Date - Sep 21 , 2026 | 06:21 AM
ముంబైలోని కోస్టల్ రోడ్డులో ఆదివారం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ముంబైలో ముగ్గురు యువకుల మృతి
ముంబై, సెప్టెంబరు 20: ముంబైలోని కోస్టల్ రోడ్డులో ఆదివారం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు అదుపు తప్పి బ్రిడ్జి పై నుంచి పడి ముగ్గురు యువకులు మృతి చెందారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరైన్ డ్రైవ్ నుంచి ఈ యువకులు కారులో హాజి అలీకి అతి వేగంగా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు బ్రిడ్జి పై నుంచి పక్కనున్న పార్కింగ్ సైట్‌లోకి పడిపోయింది. దీంతో ధ్వంసమైన కారు నుంచి బాధితులను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారిలో ముగ్గురు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.