శ్రీవారి సేవలో ప్రముఖులు
ABN , First Publish Date - 2023-01-26T04:29:33+05:30 IST
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీపాదరాజ మఠాధిపతి సుజయనిధి తీర్థస్వామి దర్శించుకున్నారు.
తిరుమల, జనవరి25(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీపాదరాజ మఠాధిపతి సుజయనిధి తీర్థస్వామి దర్శించుకున్నారు. బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు.. ఆలయ అర్చక బృందం, డిప్యూటీ ఈవో రమే్‌షబాబు ఇస్తికాఫల్ (ఆలయ మర్యాదలు)తో స్వాగతం పలికారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని మాజీ గవర్నర్ నరసింహన్ దర్శించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామికి సోమవారం హుండీ ఆదాయం రూ.5.45 కోట్లు లభించింది. సోమవారం వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు దర్శించుకున్న భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించగా ఈ ఆదాయం లభించినట్టు టీటీడీ బుధవారం ప్రకటించింది.