Share News

అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురి మృతి

ABN , Publish Date - Sep 21 , 2026 | 11:08 AM

అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ విరుచుకుపడింది. సోమవారం తెల్లవారుజామున కునార్, పక్తికా ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో ముగ్గురు మృతి చెందారు..

అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ముగ్గురి మృతి
Pakistan Airstrikes

ఇంటర్నెట్ డెస్క్: అఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులు జరిపింది. ఈరోజు (సోమవారం) తెల్లవారుజామున అఫ్ఘాన్‌లోని కునార్, పక్తికా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధవిమానాలతో పాక్ బాంబుల వర్షం కురిపించింది. పక్తికాలోని రెండు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్ నిర్వహించింది. ఇక్కడ ఆస్తి నష్టం వాటిల్లిన్నప్పటికీ ప్రాణనష్టం జరగలేదు. అయితే కునార్‌లో జరిపిన దాడుల్లో మాత్రం ముగ్గురు మృత్యువాతపడ్డారు. అలాగే పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.


కాగా అఫ్గాన్, పాక్ సరిహద్దు ప్రాంత ప్రజలను ఈ దాడులు ఆందోళనలోకి నెట్టేశాయి. ఈ రెండు దేశాల మధ్య కొంత కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ దాడులు చేసింది.

ఈ దాడుల కారణంగా అమాయక పౌరులు మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (UNAMA-United Nations Assistance Mission in Afghanistan) నివేదిక ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు సరిహద్దు హింసలో 57 మంది మరిణించగా, 342 మంది గాయపడ్డారు. వైమానిక దాడుల కారణంగానే పౌరులు మృతి చెందుతున్నారని ఆ నివేదిక తెలిపింది. పక్తికా, కునార్ ప్రాంతాల ప్రజలు ఎక్కువగా ఎయిర్‌స్ట్రైక్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని వివరించింది.


ఇవీ చదవండి

అది డ్రోనా.. లేక ప్లేనా..? ఇరాన్‌ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ.. వీడియో వైరల్

ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం!

Updated Date - Sep 21 , 2026 | 11:36 AM