ట్రంప్-హౌతీల మధ్య రహస్య ఒప్పందం.. సౌదీకి అమెరికా షాక్ ఇస్తోందా..
ABN , Publish Date - Sep 21 , 2026 | 09:53 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యెమెన్‌లోని హౌతీ సంస్థ మధ్య పరోక్ష అవగాహన కుదిరిందా? అమెరికా నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు హామీలు ఇచ్చారా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యెమెన్‌లోని హౌతీ సంస్థ మధ్య పరోక్ష అవగాహన కుదిరిందా? అమెరికా నౌకలపై దాడులు చేయబోమని హౌతీలు హామీలు ఇచ్చారా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. ఒకవైపు సౌదీ అరేబియాపై హౌతీలు తీవ్ర దాడులు చేస్తున్నారు. సౌదీతో స్నేహం చేసే అమెరికా మాత్రం హౌతీలతో రహస్య ఒప్పందం చేసుకుందనే చర్చ జరుగుతోంది (Donald Trump Houthis).
అమెరికా, హౌతీ ప్రతినిధుల మధ్య ఒమన్‌లో సంప్రదింపులు జరిగినట్లు 'రాయిటర్స్' గత వారం వెల్లడించింది. మస్కట్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో ఈ సమావేశం జరిగినట్లు పేర్కొంది. ఈ చర్చలకు ఒమన్ మధ్యవర్తిత్వం చేసినట్లు సమాచారం. అమెరికా బలగాలు, నౌకలు, వాణిజ్య ప్రయోజనాలపై దాడులు చేయబోమని హౌతీలు హామీ ఇచ్చినట్లు ట్రంప్ తాజాగా వెల్లడించారు. అమెరికా, హౌతీల మధ్య నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు (Trump Houthi deal).
అమెరికా బలగాలపై దాడులు చేయకూడదన్న అవగాహన హౌతీల నుంచి వచ్చినట్లు ట్రంప్ తెలిపారు (US Houthis talks). అయితే సౌదీ అరేబియాపై దాడుల అంశం గురించి మాత్రం మాట్లాడలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్‌తో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి. హౌతీలపై అమెరికా సైనిక చర్య చేపట్టాలని ట్రంప్‌ను కోరినట్లు సమాచారం. అయితే ట్రంప్ మాత్రం అందుకు సముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ-అమెరికా బంధంపై బీటలు వారుతున్నట్టు చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..