శాంతికే మా తొలి ప్రాధాన్యం.. ట్రంప్‌తో న్యూయార్క్‌లో భేటీ: జెలెన్ స్కీ
ABN , Publish Date - Sep 21 , 2026 | 08:48 AM
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో న్యూయార్క్‌లో సమావేశం కానున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ఇద్దరు నేతలు న్యూయార్క్‌కు వెళ్లనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో న్యూయార్క్‌లో సమావేశం కానున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం కోసం ఇద్దరు నేతలు న్యూయార్క్‌కు వెళ్లనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగనుంది. ట్రంప్‌తో సమావేశం తర్వాత చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని, దౌత్యపరంగా ముందడుగు పడుతోందని జెలెన్ స్కీ పేర్కొన్నారు (Zelensky Trump meeting).
ఉక్రెయిన్‌కు శాంతి ప్రక్రియే మొదటి ప్రాధాన్యమని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. యుద్ధాన్ని నివారించేందుకు తీసుకోగల చర్యలు, భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై అమెరికా బృందంతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఇంధన భద్రత, ఆహార భద్రత, ప్రజల ప్రాణాల రక్షణ వంటి అంశాలు చర్చల్లో ఉన్నాయని వెల్లడించారు. న్యూయార్క్‌లో ట్రంప్‌తో జరిగే సమావేశం చాలా మార్పులకు దారితీయవచ్చని అన్నారు. ప్రస్తుతం దౌత్యపరంగా కొంత పురోగతి కనిపిస్తోందని తెలిపారు (Ukraine peace talks).
రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు అమెరికా దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్న కీలక సమయంలో ట్రంప్, జెలెన్‌స్కీ సమావేశం జరగనుంది (Ukraine Russia war). మరోవైపు ఇదే సమయంలో రష్యాపై ఆంక్షలకు సంబంధించిన లిండ్సే గ్రాహం బిల్లును అమెరికా చట్టంగా మార్చింది. ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఆంక్షల బిల్లు తీసుకొచ్చినందుకు ట్రంప్ ప్రభుత్వానికి జెలెన్ స్కీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..