భారత జీడీపీ 7 శాతం: మూడీస్
ABN , Publish Date - Sep 19 , 2026 | 02:16 AM
అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచింది. గతంలో ఈ వృద్ధి రేటు 6 శాతం వరకు ఉంటుందన్న ఈ సంస్థ ఇప్పుడు ఈ అంచనాలను 7 శాతానికి పెంచింది.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను భారీగా పెంచింది. గతంలో ఈ వృద్ధి రేటు 6 శాతం వరకు ఉంటుందన్న ఈ సంస్థ ఇప్పుడు ఈ అంచనాలను 7 శాతానికి పెంచింది. జీ-20 దేశాల జీడీపీ ఈ సంవత్సరం ఈ స్థాయిలో పెరిగే అవకాశం లేదని కూడా మూడీస్ స్పష్టం చేసింది. ఇది ఆర్‌బీఐ అంచనా వేసిన 6.7 శాతం కంటే 0.3 శాతం ఎక్కువ. అయితే సెగలు కక్కుతున్న ముడి చమురు, వెంటాడుతున్న ఎల్‌నినో భారత్‌లో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4.8 శాతానికి ఎగదోసే ప్రమాదం ఉందని హెచ్చరించింది.