ఇరాన్ యుద్ధం.. నా ముందు మూడు మార్గాలు: అమెరికా అధ్యక్షుడు
ABN , Publish Date - Sep 21 , 2026 | 07:32 AM
ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ షరతులను అంగీకరించకపోతే అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ షరతులను అంగీకరించకపోతే అమెరికాతో పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ తన వైఖరిని మార్చుకోకపోతే భారీ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు (Trump Iran warning).
తాజాగా 'ఫాక్స్ న్యూస్'తో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ విషయంలో తాను ప్రస్తుతం కీలక నిర్ణయం తీసుకునే దశలో ఉన్నట్లు చెప్పారు. ఇరాన్ యుద్ధం విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రస్తుతం మూడు మార్గాలు తన ముందున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌ను పూర్తిగా నాశనం చేయడం, ఆ దేశాన్ని ఆర్థికంగా కుప్పకూలేలా చేయడం లేదా ఒప్పందం కుదుర్చుకోవడం వంటి అవకాశాలను ఆయన ప్రస్తావించారు. అలాగే సమీప భవిష్యత్తులో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయని చెప్పారు (Trump Iran war).
అంతకుముందు ఇరాన్ కూడా అమెరికాకు గట్టి హెచ్చరికలు చేసింది (Iran decisive war). అమెరికా దాడి చేస్తే గతం కంటే మరింత తీవ్రంగా ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ మాట్లాడుతూ.. యుద్ధం అన్ని రకాలుగానూ ముగియడం, స్తంభింపజేసిన నిధులను విడుదల చేయడం, నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేయడం వంటి షరతులను అమెరికాకు మధ్యవర్తుల ద్వారా పంపినట్లు తెలిపారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆడుకునేందుకు కారెక్కి.. ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి
సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!