Share News

సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:37 AM

మహిళా వ్యాపారవేత్త శోభారెడ్డి చేసిన ఎక్స్‌ పోస్టు తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. సీఎం సన్నిహితుడిగా భావించిన వ్యక్తి గెస్ట్‌హౌస్‌కు రావాలని కోరారని ఆమె ఆరోపించగా, ప్రభుత్వ వర్గాలు పోస్టుపై దృష్టి సారించాయి.

సీఎం సన్నిహితుడు గెస్ట్‌హౌస్‌కు రమ్మన్నారు!
Shobha Reddy viral post

  • మహిళా వ్యాపారవేత్త పోస్టు వైరల్‌

  • సీఎం ఖాతాకు ట్యాగ్‌ చేసి సమస్యను

  • ఆయన దృష్టికి తీసుకెళ్లిన శోభారెడ్డి

  • పోస్టుపై దృష్టి సారించిన ప్రభుత్వ నిఘా వర్గాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సీఎంకు సన్నిహితుడిగా భావించిన వ్యక్తిని సంప్రదించగా.. ఆయన తన గెస్ట్‌హౌ్‌సకు రావాలని అడిగారంటూ మిథునా యాడ్స్‌ అధినేత కె.శోభారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకుని సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. ఈ పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఔట్‌డోర్‌ అడ్వర్టైజింగ్‌ రంగంలో గత మూడేళ్లుగా చట్టబద్ధంగా వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కోరుతున్న తనకు అన్యాయం జరుగుతోందని.. రెగ్యులర్‌ టెండర్లు పిలిచే వరకు రెవెన్యూ షేరింగ్‌ విధానంలో తాత్కాలిక అవకాశమివ్వాలని సర్కారుకు ప్రతిపాదనలు సమర్పించినా స్పందన లేదని శోభారెడ్డి పేర్కొన్నారు.


నిబంధనల ఉల్లంఘనలపై నోటీసులు అందుకున్నా కొన్ని ప్రకటనల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, మరికొన్ని పైలట్‌ ప్రాజెక్టులకు జీవో నంబర్‌ 68 కింద మినహాయింపులు, సడలింపులిచ్చారన్నారు. తన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే క్రమంలో సీఎంకు సన్నిహితుడిగా తాను భావించిన వ్యక్తిని సంప్రదించగా.. ఆ విషయం మాట్లాడేందుకు గెస్ట్‌హౌ్‌సకు రావాలని ఆయన కోరడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వ్యక్తి పేరు వెల్లడించేందుకు, బహిరంగ వేదికలపై వ్యక్తిగత ఆరోపణలు చేసేందుకు తాను ఇష్టపడటం లేదని, మహిళా వ్యాపారవేత్తగా తనకు ప్రత్యేక ప్రయోజనాలు అవసరం లేదని.. చట్టబద్ధమైన అవకాశం, సమానమైన ఆదరణ, గౌరవం మాత్రమే కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. ఈ పోస్టును సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ తదితరుల ఖాతాలకు ట్యాగ్‌ చేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో ప్రభుత్వ నిఘా వర్గాలు దీనిపై దృష్టి సారించాయి.


వార్తలనూ చదవండి:

ఆడుకునేందుకు కారెక్కి.. ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి మృతి
తొలి అడుగులోనే ‘కృత్రిమ’ గండం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 06:37 AM