మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Sep 11 , 2026 | 10:26 AM
దేశీయంగా బంగారం, వెండి ధరలు భారీ తగ్గుదలను నమోదు చేశాయి. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీ తగ్గుదల నమోదు చేశాయి (Gold and Silver Rates). గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, శుక్రవారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,52,890గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.2620 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,40,150గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే రూ.2400 మేర తగ్గింది (Live Gold Rates).
మరోవైపు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. కిలోకు ఏకంగా రూ.10 వేల మేర తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది.
తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు..
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
హైదరాబాద్ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
నిజామాబాద్ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
ఖమ్మం | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
వరంగల్ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
ఏపీలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
విజయవాడ | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
విశాఖపట్నం | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
గుంటూరు | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
నెల్లూరు | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
తిరుపతి | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు
నగరం | 24 క్యారెట్లు | 22 క్యారెట్లు | 18 క్యారెట్లు |
చెన్నై | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,17,850 |
ముంబై | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
ఢిల్లీ | రూ.1,53,040 | రూ.1,40,300 | రూ.1,14,670 |
కోల్‌కతా | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,820 |
అహ్మదాబాద్ | రూ.1,52,940 | రూ.1,40,200 | రూ.1,14,720 |
కేరళం | రూ.1,52,890 | రూ.1,40,150 | రూ.1,14,670 |
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలను చెక్ చేసుకోవలసిందిగా సూచన
ఇవి కూడా చదవండి..
బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..