Share News

రూ.15 వేల కోట్ల కట్టేసినా మాల్యాపై కేసు ఆగదు.. ఈడీ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Sep 11 , 2026 | 10:02 AM

వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

రూ.15 వేల కోట్ల కట్టేసినా మాల్యాపై కేసు ఆగదు.. ఈడీ కీలక వ్యాఖ్యలు..
Vijay Mallya

ఇంటర్నెట్ డెస్క్: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుల బకాయిల్లో భారీ మొత్తాన్ని రికవరీ చేసినంత మాత్రాన విజయ్ మాల్యాపై కొనసాగుతున్న ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) విచారణలు, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ముగిసిపోవని బాంబే హైకోర్టుకు తెలిపింది (Vijay Mallya money laundering case).


మాల్యా ఆస్తుల నుంచి బ్యాంకుల కన్సార్టియం దాదాపు రూ.15,000 కోట్ల మేర రికవరీ చేసిందని ఆయన తరఫు న్యాయవాది గతంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈడీ జప్తు చేసిన ఆస్తుల ద్వారా బ్యాంకులకు భారీ మొత్తంలో డబ్బు తిరిగి వచ్చిందని తెలిపారు. అసలు బకాయిల సమస్య దాదాపు పరిష్కారమైనందున, తనపై కొనసాగుతున్న కొన్ని న్యాయపరమైన చర్యలను ముగించాలని కోర్టును మాల్యా కోరుతున్నారు. అయితే ఈ రికవరీ అంశం సివిల్ బకాయిలకు సంబంధించినదని, మనీలాండరింగ్‌కు సంబంధించిన క్రిమినల్ కేసులు మాత్రం ప్రత్యేకమైనవని ఈడీ తన సమాధానంలో స్పష్టం చేసింది (ED Vijay Mallya, PMLA case).


విజయ్ మాల్యా 2016లో భారత్‌ను విడిచి బ్రిటన్‌కు వెళ్లిపోయారు (Vijay Mallya bank dues). 2019లో ఆయనను 'ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్'గా ప్రకటించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన బ్యాంకు రుణాల వ్యవహారంలో ఆయనపై మనీలాండరింగ్, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులు కొనసాగుతున్నాయి. మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. తనపై నమోదైన కేసుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

బ్రిక్స్‌ సదస్సు కోసం ఢిల్లీకి పుతిన్.. నేడు ప్రధాని మోదీతో కీలక భేటీ..

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 11 , 2026 | 10:15 AM