Share News

ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం!

ABN , Publish Date - Sep 21 , 2026 | 06:08 AM

ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, హిజాబ్‌లను నిషేధించాలని ప్రధాని జార్జియా మెలోనీ యోచిస్తున్నారు. ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా, హిజాబ్‌లను అనుమతించరాదని భావిస్తున్నారు. స్త్రీ-పురుష సమానత్వానికి సంబంధించిన నిబంధనలు పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, హిజాబ్‌లపై నిషేధం!
meloni

ప్రధాని మెలోనీ యోచన

రోమ్‌, సెప్టెంబరు 20: ఇటలీ పాఠశాలల్లో బుర్ఖా, హిజాబ్‌లను నిషేధించాలని ప్రధాని జార్జియా మెలోనీ యోచిస్తున్నారు. ముఖాన్ని కప్పి ఉంచే బుర్ఖా, హిజాబ్‌లను అనుమతించరాదని భావిస్తున్నారు. స్త్రీ-పురుష సమానత్వానికి సంబంధించిన నిబంధనలు పాటించాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. అంతేకాదు తరగతుల్లో విదేశీ విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయాలని కూడా ప్రతిపాదిస్తున్నారు. సొంత దేశంలో ఇటలీ విద్యార్థులు తాము మైనార్టీలమని భావించే పరిస్థితి రాకూడదని మెలోనీ చెప్పారు. ఇతర దేశాల నుంచి వలస వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఇటాలియన్‌ భాష తప్పనిసరి నేర్చుకోవాలనే నిబంధన తీసుకురానున్నారు.

Updated Date - Sep 21 , 2026 | 06:16 AM