Share News

సెలూన్‌లో కోతికి మసాజ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Sep 21 , 2026 | 07:20 AM

సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్ లేదా మసాజ్ చేయించుకోవడం సర్వసాధారణం. కానీ ఓ కోతి మాత్రం ఏకంగా సెలూన్ కస్టమర్‌గా మారిపోయింది. కుర్చీలో హాయిగా పడుకుని, మసాజ్ చేయించుకుంది. ఈ కోతి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

సెలూన్‌లో కోతికి మసాజ్.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Monkey Head Massage

ఇంటర్నెట్ డెస్క్: సెలూన్‌కు వెళ్లి హెయిర్ కట్ లేదా మసాజ్ చేయించుకోవడం సర్వసాధారణం. కానీ ఓ కోతి మాత్రం ఏకంగా సెలూన్ కస్టమర్‌గా మారిపోయింది. కుర్చీలో హాయిగా పడుకుని.. మసాజ్ చేయించుకుంటూ కనిపించింది. అంతేకాదు.. కళ్లు మూసుకుని మరింత రిలాక్స్ అవుతూ కనిపించింది. దీంతో అక్కడున్న వారికి ఈ దృశ్యం ఆశ్చర్యంతో పాటు నవ్వు తెప్పించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ కోతి సెలూన్‌‌లో కుర్చీపై పడుకుని ఉండగా.. బార్బర్ దానికి మసాజ్ చేస్తున్నాడు. ఆ కోతి కూడా ఏమాత్రం కదలకుండా అచ్చం మనిషిలా ఎంజాయ్ చేస్తూ మసాజ్ చేయించుకుంటూ రిలాక్స్ అవుతోంది. అయితే కోతి ప్రవర్తన చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. ‘వీఐపీ కస్టమర్’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘కోతి భలే రిలాక్స్ అవుతోంది.. దాని ఫ్రెండ్స్‌కూ రికమండ్ చేస్తుందేమో’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు తెలియరాలేదు.


ఈ వార్తలు కూడా చదవండి:

శ్మశానం... ఓ పర్యాటక ప్రాంతం...

ప్రజా సేవకు బద్ధులై ఉండడమే ఉద్యోగ విధి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 07:55 AM