Share News

పక్షులతో చేపల వేట

ABN , Publish Date - May 24 , 2026 | 01:34 PM

చేపలు పట్టాలంటే గాలం వేయాలి. లేదంటే వలలు విసరాలి. కానీ చైనాలోని యాంగ్‌షౌలో మాత్రం చేపలు పట్టేందుకు పక్షులను వదులుతారు.

పక్షులతో చేపల వేట
Fishing, Birds

చేపలు పట్టాలంటే గాలం వేయాలి. లేదంటే వలలు విసరాలి. కానీ చైనాలోని యాంగ్‌షౌలో మాత్రం చేపలు పట్టేందుకు పక్షులను వదులుతారు. వాటి సహాయంతో బుట్ట నిండా చేపలు పడతారు. కొన్ని వందల ఏళ్ల నాటి ఈ సంప్రదాయ ఫిషింగ్‌ ఇప్పటికీ కొనసాగుతోంది. అంతేకాదు, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ జాలర్లకు ఆదాయమార్గంగా నిలుస్తోంది.

చెరువులో, నదిలో చేప కంట పడితే చాలు... కొన్ని రకాల పక్షులు చటుక్కున వాటిని నోటితో పట్టేసి మింగేస్తాయి. అయితే చైనాలో జాలర్లు చేపలు పట్టేందుకు ఉపయోగించే పక్షులు మాత్రం చటుక్కున మింగేయవు. ఇంకా చెప్పాలంటే చేపను గుటుక్కుమనిపించ లేవు. ఎందుకంటే పక్షుల యజమాని వాటి మెడకు ఒక రింగ్‌ వేస్తాడు. ఈ విధానాన్ని ‘కార్మోరెంట్‌ ఫిషింగ్‌’ అంటారు. యాంగ్‌షౌలో ఉన్న లీ నదిలో ఈ దృశ్యం రోజూ కనువిందు చేస్తుంటుంది.


book9.2.jpgస్థానిక జాలర్లు చేపలు పట్టేందుకు బ్యాంబూ పడవల్లో పక్షులను తీసుకుని వెళతారు. ఆ పక్షిని కార్మోరెంట్‌ అని పిలుస్తారు. అవి నల్లగా, బలిష్టంగా ఉంటాయి. మెడ పొడవుగా ఉంటుంది. పెంపుడు పక్షులకు జాలర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. వాటి కాళ్లకు ఒక తాడు కట్టి కర్రకు కట్టుకుంటారు. పక్షులు చిన్నచిన్న చేపలను నోటితో పట్టుకుని, ఠక్కున మింగేస్తాయి. అయితే జాలర్లు పక్షి మెడ కింది భాగంలో ఒక రింగ్‌ను అమర్చుతారు. దానివల్ల పక్షి చేపను మింగాలని ప్రయత్నించినా గొంతుకు అడ్డం పడి సాధ్యం కాదు.


book9.3.jpgజాలరి పక్షిని పడవలోకి చేర్చి దాని నోట్లో ఉన్న చేపను తీసుకుని మళ్లీ నీళ్లలోకి వదులుతాడు. ఈ దృశ్యాల్ని చూడటానికి పర్యాటకులు అక్కడికి పోటెత్తుతుంటారు. జాలర్లు ఎక్కువగా రాత్రుళ్లు చేపలు పట్టడం చేస్తుంటారు. లాంతరు వెలుతురుకి చేపలు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. ఈ చేపలు పట్టే విధానం పక్షులకు, మనుషులకు మధ్య ఉన్న ప్రత్యేక సంబంధాన్ని తెలియజేస్తుంది. వందల ఏళ్లు గడిచినా కొన్ని ప్రాంతాల్లో చైనీయులు ఇలాంటి సంప్రదాయ పద్ధతుల్లో చేపలు పట్టడం చేస్తున్నారంటే ఆశ్చర్యమే!


book9.4.jpgఈ వార్తలు కూడా చదవండి:

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 01:34 PM