Share News

జొన్న, మెుక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్..

ABN , Publish Date - May 24 , 2026 | 12:28 PM

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న, మెుక్కజొన్న కొనుగోళ్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు.

జొన్న, మెుక్కజొన్న రైతులకు గుడ్ న్యూస్..
Minister Thummala Nageswara Rao

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. జొన్న, మెుక్కజొన్న కొనుగోళ్లకు నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మెుక్కజొన్న కొనుగోలుకు రూ.1,800 కోట్లు, జొన్న కొనుగోలుకు రూ.1,100 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మెుక్కజొన్న కొనుగోళ్లపై విన్నవించినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు తుమ్మల. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చిందన్నారు.


రైతులను కాపాడేందుకు కొనుగోళ్లు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. మొక్కజొన్న సేకరించేందుకు ఇప్పటికే రూ.4000 కోట్లు విడుదల చేశామని.. తాజాగా రూ.1,800 కోట్ల కేటాయింపులతో మెుత్తం రూ.5,800 కోట్లకు చేరిందన్నారు. భారీ దిగుబడుల నేపథ్యంలో సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు. మరోవైపు రూ.1,100 కోట్లతో జొన్న పంట కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాల వారీగా సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.


అలాగే పొద్దుతిరుగుడు రైతులనూ ఆదుకుంటామని మంత్రి తుమ్మల భరోసా ఇచ్చారు. ఈ మేరకు 25 శాతానికి మించి పంటను కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తుమ్మల చెప్పుకొచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

రెచ్చిపోయిన కారు రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..

న్యాయవాది హత్య కేసు.. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తింపు..

Updated Date - May 24 , 2026 | 12:32 PM