న్యాయవాది హత్య కేసు.. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టు గుర్తింపు..
ABN , Publish Date - May 24 , 2026 | 11:28 AM
మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని గుర్తించారు.
హైదరాబాద్, మే 24: ఇంటి బయట కారు ఎక్కుతుండగా న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. శనివారం మొయినుద్దీన్ ప్రత్యర్థులు కారుతో ఆయనను ఢీకొట్టి చంపేశారు. కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. మొయినుద్దీన్‌ను ఢీకొట్టిన కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చారు. వక్ఫ్ ఆస్తుల వివాదమే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. నిందితులు 3 రోజులు రెక్కీ చేసి న్యాయవాదిని చంపారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం 5 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
కేసు వివరాలు..
న్యాయవాది ఖాజా మొహియుద్దీన్ మాసబ్‌ట్యాంక్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సిటీ సివిల్ కోర్టులో పనిచేస్తున్నారు. హైకోర్టులోనూ అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న మామను చూడటానికి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బయలుదేరారు. ఇంటి బయట కారు ఎక్కుతుండగా ప్రత్యర్థులు కారులో వేగంగా వచ్చి మొహియుద్దీన్‌ను ఢీకొట్టారు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్‌ను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి
నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..
జనగణన విధులకు గైర్హాజరు.. 10 మంది ఆర్పీలపై సస్పెన్షన్ వేటు