Share News

జనగణన విధులకు గైర్హాజరు.. 10 మంది ఆర్పీలపై సస్పెన్షన్ వేటు

ABN , Publish Date - May 24 , 2026 | 10:47 AM

కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీలో జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది ఆర్పీలపై (రిసోర్స్ పర్సన్స్) జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరైన 10 మంది ఆర్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

జనగణన విధులకు గైర్హాజరు.. 10 మంది ఆర్పీలపై సస్పెన్షన్ వేటు
Census Duty Negligence

కృష్ణా జిల్లా, మే 24 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లాలోని తాడిగడప మున్సిపాలిటీలో జనగణన విధుల్లో నిర్లక్ష్యం వహించిన 10 మంది ఆర్పీలపై (రిసోర్స్ పర్సన్స్) జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విధులకు గైర్హాజరైన 10 మంది ఆర్పీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 మంది ఆర్పీలను జనగణన కార్యక్రమాల కోసం నియమించినట్లు అధికారులు తెలిపారు.


అయితే విధుల్లో నిర్లక్ష్యం, గైర్హాజరు కారణంగా 10 మంది పనితీరుపై కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని మెప్మా పీడీకి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. జనగణన వంటి కీలక ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్

నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 10:48 AM