నంద్యాల జిల్లా సున్నిపెంటలో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు..
ABN , Publish Date - May 24 , 2026 | 11:08 AM
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది.
నంద్యాల జిల్లా: శ్రీశైలం మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. సున్నిపెంట జెన్ కో కాలనీ సమీపంలో ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున చిరుత కనిపించింది. ఓ ఇంటి ముందు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ఆపై ఇనుప బాక్స్‌లోని కోడిని తినేందుకు ప్రయత్నించింది.
ఎంతసేపు ప్రయత్నించినా కోడి చిక్కకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను ఆ ఇంటి వారు తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సున్నిపెంట శివారుల్లో తరచుగా చిరుతపులులు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. చిరుతల సంచారంతో భయాందోళనలకు గురవుతున్నామని పేర్కొన్నారు. వాటి నుంచి తమను రక్షించాలని అటవీశాఖ అధికారులను కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
తెనాలిలో విషాదం.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
జనగణన విధులకు గైర్హాజరు.. 10 మంది ఆర్పీలపై సస్పెన్షన్ వేటు