తెనాలిలో విషాదం.. పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
ABN , Publish Date - May 24 , 2026 | 09:55 AM
తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది.
గుంటూరు జిల్లా, మే 24 (ఆంధ్రజ్యోతి): తెనాలిలో మహిళ ఆత్మహత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసింది. ఆమె గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ వీడియోలో పోలీసులపై పలు ఆరోపణలు చేసింది. ఓ కేసు విషయంలో తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు వేధిస్తున్నారని వీడియోలో ఆరోపించింది. తాను చేయని నేరంలో ఇరికించి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
కొంతకాలం క్రితం కొత్తపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో భర్తతో కలిసి వాచ్ ఉమన్‌గా పనిచేసిన తిరుపతమ్మపై, అదే అపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ మహిళ బంగారం ఇచ్చానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ ఆరోపణలు తప్పుడువని, తనపై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని బాధిత మహిళ ఆరోపించింది. ఈ ఘటనపై స్థానికంగా చర్చ జరుగుతోంది. సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పోలీసుల వ్యవహారశైలిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
నా దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. సీఎం చంద్రబాబు వార్నింగ్
నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News