Share News

చింతపండు డేట్స్‌ చట్నీ.. ఇలాచేస్తే ఆ రుచే వేరుగా..

ABN , Publish Date - May 24 , 2026 | 12:56 PM

చింతపండు డేట్స్‌ చట్నీ.. తయారీకి కావాల్సినవి.. గింజలు లేని చింతపండు - అర కప్పు, గింజలు లేని డేట్స్‌ - అర కప్పు, బెల్లం - అర కప్పు

చింతపండు డేట్స్‌ చట్నీ.. ఇలాచేస్తే ఆ రుచే వేరుగా..
Vantalu

కావలసిన పదార్థాలు: గింజలు లేని చింతపండు - అర కప్పు, గింజలు లేని డేట్స్‌ - అర కప్పు, బెల్లం - అర కప్పు, ధనియాల పొడి - స్పూను, జీలకర్ర పొడి - అర స్పూను, కారం - స్పూను, శొంఠి - అర స్పూను, ఉప్పు, నీళ్లు - తగినంత.


book8.jpgతయారుచేసే విధానం: పెద్ద బాణలిలో చింతపండు, ఖర్జూరాలను వేసి, రెండు కప్పుల నీళ్లు పోసి పది నిమిషాల పాటు ఉడికించాలి. అయిదు నిమిషాల తరవాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, శొంఠి, ఉప్పు కూడా వేసి ఉడికించాలి. చింతపండు, ఖర్జూరాలను గరిటెతో మెత్తగా చేయాలి. మంట తగ్గించి మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్‌ కట్టేయాలి. పూర్తిగా చల్లారాక ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి, ప్యూరీలా చేసుకుని, ఓ సీసాలోకి వేసి ఫ్రిజులో పెడితే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..

వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 24 , 2026 | 12:56 PM