ఇరాన్‌తో ఒప్పందం దాదాపు ఖాయం.. శాంతి చర్చలపై ట్రంప్ పోస్ట్..
ABN , Publish Date - May 24 , 2026 | 12:12 PM
ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో భారీ ఒప్పందం చాలా దగ్గరలో ఉందని, చర్చలు తుది దశకు చేరుకున్నాయని తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు.
ఇరాన్‌తో జరుగుతున్న శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో భారీ ఒప్పందం చాలా దగ్గరలో ఉందని, చర్చలు తుది దశకు చేరుకున్నాయని తన సోషల్ మీడియా ఖాతా 'ట్రూత్' ద్వారా ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్, ఆ ప్రాంతంలోని ఇతర మిత్రదేశాలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి (US Iran peace talks).
'అమెరికా, ఇరాన్ మధ్య ఒక భారీ ఒప్పందం చాలా వరకు చర్చల ద్వారా కుదిరింది. నేను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడాను. అది కూడా చాలా బాగా జరిగింది. ఒప్పందానికి సంబంధించిన తుది అంశాలు, వివరాలు ప్రస్తుతం చర్చిస్తున్నారు. త్వరలోనే వాటిని ప్రకటిస్తారు' అని ట్రంప్ పేర్కొన్నారు. మూడు నెలలుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంపైనే తాము దృష్టి పెట్టామని ట్రంప్ తెలిపారు (Trump Iran negotiations).
కాగా, ప్రతిపాదిత అవగాహనలో భాగంగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తామని ట్రంప్ (Donald Trump) శుక్రవారం పేర్కొన్నారు. అయితే హోర్ముజ్‌పై టెహ్రాన్ నియంత్రణ కొనసాగుతుందని చెబుతూ, ట్రంప్ వాదనను ఇరాన్ కొట్టిపడేసింది. యుద్ధానికి ముందున్న స్థాయికి ఓడల రాకపోకల సంఖ్యను తిరిగి తీసుకురావడానికి మాత్రమే అంగీకరించినట్టు ఇరాన్ పేర్కొంది. అంతే తప్ప యుద్ధానికి ముందు ఉన్నటువంటి స్వేచ్ఛా రవాణాకు అంగీకరించబోమని తేల్చి చెప్పింది.
ఇవి కూడా చదవండి..
అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..
ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..