కాంగ్రెస్ వాళ్లని దరిదాపుల్లోకి రానివ్వొద్దు.. విజయ్‌కు మద్దతివ్వడంపై ఉదయనిధి ఆగ్రహం..
ABN , Publish Date - May 24 , 2026 | 11:47 AM
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై డీఎంకే నాయకుడు, యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవడానికి డీఎంకే కార్యకర్తలే కారణమని, తీరా గెలిచిన తర్వాత పదవుల కోసం తమతో మాట మాత్రమైనా చెప్పకుండా టీవీకే చెంతకు చేరారని అన్నారు (DMK vs Congress).
కనీస కృతజ్ఞత, మర్యాద లేని కాంగ్రెస్‌ను ఎప్పటికీ నమ్మకూడదని, వారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని ఉదయనిధి పేర్కొన్నారు (Udhayanidhi Stalin). 'భారతదేశవ్యాప్తంగా బీజేపీ విజయానికి మోదీ, అమిత్ షా కారణమని నేను భావించాను. కానీ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్ కారణమని ఇప్పుడు స్పష్టమైంది. గత పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మా నాయకుడు ఎంకే స్టాలిన్ తన భుజాలపై మోశారు' అని ఉదయనిధి పేర్కొన్నారు
తమ మిత్రపక్షాల కష్టార్జితంపై బతుకుతున్న కాంగ్రెస్ వాళ్లు వెన్నుపోటుదారులు, జలగలని ఉదయనిధి తీవ్ర వ్యాఖ్యలు చేశారు (Tamil Nadu politics). తమిళనాడు ప్రజలు అతి త్వరలోనే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం నేర్పిస్తారని హెచ్చరించారు. కాగా, కమ్యూనిస్టులు, వీసీకే, ఐయూఎంఎల్.. విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లి.. క్యాబినెట్‌లో భాగమవడాన్ని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కూడా తప్పుబట్టారు.
ఇవి కూడా చదవండి..
అమెరికా నిజాయితీగా వ్యవహరించడం లేదు.. చర్చల్లో రాజీ పడబోమన్న ఇరాన్..
ఈ రోజు బంగారం కొనాలనుకుంటున్నారా.. ధరలు ఎలా ఉన్నాయంటే..