వైట్‌హౌస్ వద్ద కాల్పులు.. భయంతో పరుగులు తీసిన జర్నలిస్ట్‌లు
ABN , Publish Date - May 24 , 2026 | 10:41 AM
నాసిర్ బెస్ట్ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర కాల్పులు జరుపుతున్న సమయంలో చుట్టు పక్కల చాలా మంది జర్నలిస్ట్‌లు ఉన్నారు. బుల్లెట్ల శబ్దం వినపడగానే వారి గుండెలు ఝల్లుమన్నాయి. బుల్లెట్లకు భయపడి అక్కడినుంచి పరుగులు పెట్టారు.
ఇంటర్‌నెట్ డెస్క్: అమెరికాలోని వైట్‌హౌస్ దగ్గర శనివారం సాయంత్రం కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మేరిల్యాండ్‌కు చెందిన 21 ఏళ్ల నాసిర్ బెస్ట్ 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్లపై కాల్పులకు తెగబడ్డాడు. ఆఫీసర్లు జరిపిన ఎదురు కాల్పుల్లో గాయాలపాలైన దుండగుడు ప్రాణాలు కోల్పోయాడు.
భయంతో జర్నలిస్ట్‌ల పరుగులు..
నాసిర్ బెస్ట్ సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గర కాల్పులు జరుపుతున్న సమయంలో చుట్టు పక్కల చాలా మంది జర్నలిస్ట్‌లు ఉన్నారు. బుల్లెట్ల శబ్దం వినపడగానే వారి గుండెలు ఝల్లుమన్నాయి. బుల్లెట్లకు భయపడి అక్కడినుంచి పరుగులు పెట్టారు. నాసిర్ కాల్పులు జరుపుతున్న సమయంలో ప్రముఖ జర్నలిస్ట్ సెలినా వాంగ్ అక్కడే వీడియో షూట్‌లో ఉన్నారు. భయపడిపోయిన ఆమె బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి నేలపై దాక్కున్నారు. ఎన్‌బీసీ న్యూస్ జర్నలిస్ట్ జూలీ టిర్‌స్కిన్‌కు అక్కడ ఏం జరుగుతోందో అర్థం కాలేదు. బుల్లెట్ల సౌండ్ పదే పదే వినిపిస్తుండటంతో.. ‘ఏంటది?’ అని అడిగారు.
కాల్పుల కారణంగా జర్నలిస్ట్‌లు భయపడిపోయిన దృశ్యాల తాలూకా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక, ఈ సంఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. నాసిర్ బెస్ట్ సెక్యూరిటీ పాయింట్ దగ్గర 20 నుంచి 25 రౌండ్ల దాకా కాల్పులు జరిపాడు.
ఇవి కూడా చదవండి
ఈ భూమి మీద తొలి ట్రిలయనీర్ ఎలాన్ మస్క్.. ఆయన వాటాదారులకు కూడా భారీ లాభాలు..
రెచ్చిపోయిన కార్ రేసర్లు.. అర్ధరాత్రి వేళ హంగామా..